బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ ఒక్కో ఇన్స్టాగ్రామ్ పోస్టుకు రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు తీసుకుంటారట.. దీపిక పడుకునే తీసుకునేది రూ. కోటిన్నరపైనేనట.. అలియా భట్ రూ. కోటి చార్జ్ చేస్తారట… అక్షయ్ కుమార్ రేటు రూ. 2 కోట్లు… ప్రియాంక చోప్రా రూ. 1.8 కోట్లు…. నిత్యం ఇలాంటివార్తలు చూస్తూనే ఉంటాం. సోషల్ మీడియా విస్తృతమయ్యాక ఇన్ఫ్లూయెన్సర్లు దాన్ని కూడా క్యాష్ చేసుకోగలుగుతున్నారు. వ్యాపారసంస్థలు ఈ ఇన్ఫ్లూయెన్సర్లను వాడుకుంటుంటే… ఇన్ఫ్లూయెన్సర్లు వ్యాపార సంస్థల నుంచి డబ్బు తీసుకుని వారి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంటే అంత డబ్బు.
సినిమా సెలబ్రిటీలు ఇన్ఫ్లూయెన్సర్లుగా వ్యాపార ప్రకటనలు పోస్ట్ చేసి డబ్బు సంపాదిస్తుంటే మరికొందరు రాజకీయంగా ఏదో ఒక పార్టీకి అనుకూలమైన పోస్టులు చేసి డబ్బు, ప్రాపకం సంపాదిస్తుంటారు. తాజాగా ఒకప్పటి బాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా ఈ జాబితాలో చేరిపోయారంటున్నారు. చేతిలో సినిమాలు లేక… తీసిన సినిమాలు ఆడక.. పీపాలు పీపాలు తాగడానికి డబ్బు చాలక ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాంగోపాల్ వర్మ ఓ పొలిటికల్ పార్టీతో ప్యాకేజీ కుదుర్చుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన ట్వీటే అందుకు ఉదాహరణ అని చెప్తున్నారు.
పవన్, చంద్రబాబు భేటీ తరువాత ఆదివారం రాత్రి 11 గంటలకు రాంగోపాల్ వర్మ ఈ ట్వీట్ చేశారు. కేవలం డబ్బు కోసం సొంత కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తాడని ఊహించలేదు… రిప్ కాపులు.. కంగ్రాట్స్ కమ్మోళ్లు అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు.అందులో ఎక్కడా పవన్, చంద్రబాబుల పేర్లు ఆయన వాడనప్పటికీ అది పవన్‌ను నేరుగా లక్ష్యం చేసుకుని ట్వీటేనని ఎవరికైనా అర్థమవుతుంది. కాగా పవన్, చంద్రబాబు భేటీ తరువాత ఉదయం నుంచి వైసీపీ నేతలు తెగ విమర్శలు చేస్తున్నారు.
అయితే.. ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా ప్రయోజనం కనిపించకపోవడంతో రాంగోపాల్ వర్మను వైసీపీ రంగంలోకి దించిందని జనసేన, టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రాంగోపాల్ వర్మ డబ్బు తీసుకుని ట్వీట్లు చేస్తున్నారని… ఆయన అప్పులు తీర్చితే ఏం ట్వీట్ చేయమంటే అది చేస్తారని వారు ఆరోపిస్తున్నారు. రాంగోపాల్ వర్మ ముందుముందు కూడా ఇలాంటి ట్వీట్లు చేస్తారని.. ఆయన తన ట్వీట్లకు లక్షల్లో తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.
మరోవైపు టీడీపీ నేత బుద్ధావెంకన్న కూడా రాంగోపాల్ వర్మపై అదే స్థాయిలో విమర్శలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ‘కామంతో కాళ్లు నాకావ్ అనుకున్నా… కానీ, పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు.. రిప్ ఆర్జీవీ, కంగ్రాట్స్ జగన్ రెడ్డి’ అంటూ ట్వీట్ చేశారు.