చంద్రబాబు కుప్పం పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు….. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసుల ఆంక్షలు పెడుతున్నారు. శాంతిపురం వెళ్లాల్సిన ప్రచార రథం, సౌండ్ వాహనాలు పోలీసులు నిలిపివేశారు.
ప్రచార రథం, సౌండ్ వాహనాలను గుడిపల్లి పీఎస్ కు తరలించారు. వాహన డ్రైవర్లు, సహాయక సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇది నియంత రాజ్యం కాదని, ప్రజాస్వామ్యం అని అన్నారు. ఇలాంటి నియంత చర్యలకు పాల్పడితే జగన్ రాజకీయంగా భూస్థాపితం అవుతాడని అన్నారు.
ప్రభుత్వ జీవోను అడ్డుపెట్టుకుని కుప్పంలో చంద్రబాబుగారి సభలను అడ్డుకునేందుకు పోలీసులు అత్సుత్సాహం చూపిస్తున్నారు. కుప్పం నుండి శాంతిపురం మీటింగ్ కు వెళ్తున్న ప్రచారరథాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనేక చోట్ల తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు pic.twitter.com/0Te7e9V6iO
— Telugu Desam Party (@JaiTDP) January 4, 2023