ఓ మహిళ చాలా కంత్రీపని చేసింది. మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఇద్దరికి విడాకులు ఇచ్చింది. మూడో భర్తతో కాపురం చేస్తోంది. ఇంతలో ఏమనుకుందో ఏమో.. అనూహ్యంగా రెండో భర్తతో మళ్లీ సంబంధాలు పెట్టుకుంది. అంతే.. ఈ విషయం మూడో భర్తకు తెలిసింది. మరి ఊరుకుంటాడా? పొడిచి పొడిచి చంపేశాడు. అంతేకాదు.. బాడీపై రక్తాన్ని నీట్‌గా తుడిచేశాడు.
ఏంటీ విషయం..?
యూపీలోని ఘజియాబాద్ 35 ఏళ్ల భవ్యా శర్మ పుట్టుకతో ముస్లిం. అసలు పేరు బేబీ. తొలి వివాహం ఓ హిందువుతో జరిగింది. ఆ సమయంలో జాతకాల కోసం అంటూ పేరును అంజలిగా మార్చుకుంది. తర్వా త అతడికి విడాకులిచ్చి ఓ ముస్లింను పెళ్లాడింది. అప్పుడు తన పేరును అఫ్సానాగా మార్చుకుంది. కొన్నాళ్లకు అతడితోనూ విడిపోయి.. వినోద్ శర్మ అనే హిందువును వివాహం చేసుకుంది. మరోసారి పేరును భవ్యా శర్మగా మార్చుకుంది.
అంటే మొదటి ఇద్దరు భర్తలతో ఆమెకు సంబంధం ఉండకూడదు. కానీ, రెండో భర్త అనీస్‌తో భవ్య రిలేషన్ కొనసాగించింది. రోజూ కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో 24న ఇండోర్‌లో ఉన్న భవ్యకు మూడో భర్త వినోద్ వీడియో కాల్ చేశాడు. ఆవలి వైపు భవ్యతో పాటు ఆమె మాజీ భర్త అనీస్ ఉండటాన్ని చూశాడు. పైగా వీడియో కాల్లో మాట్లాడిన అనీస్, వినోద్‌ను బెదిరించాడు. వెంటనే ఘాజియాబాద్‌ను వదిలి వెళ్లాలని.. లేదంటే ప్రాణాలు తీస్తానని హెచ్చరించాడు.
భార్య భవ్య, అనీస్‌తో మళ్లీ చనువు ఏర్పర్చుకొని తనను వంచించిందని తెలుసుకొని అప్పటికే కోపంగా ఉన్న వినోద్, ఆమె సమక్షంలోనే అనీస్ తనను బెదిరించేసరికి ఆగ్రహంతో ఊగిపోయాడు. మరుసటి రోజు ఇండోర్ నుంచి తిరిగొచ్చిన భవ్యతో కలిసి మద్యం తాగాడు. ఆమె నిద్రలోకి జారుకోగానే కత్తితో పొడిచి చంపాడు.
https://twitter.com/iamharunkhan/status/1608471546812571651