వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు.. అనేది సామెత. దీని వెనుక.. అబద్ధాలు అంటే.. విద్, ఆస్తులు.. అంతస్థులు కావొచ్చు. దీనిని అంతో ఇంతో అర్ధం చేసుకోవచ్చు. ఏదో పేదింటి అమ్మాయికో.. అబ్బాయికో పెళ్లి కాకపోతే.. ఇలా చేశారని సరిపుచ్చుకోవచ్చు. కానీ, అసలు సిసలు.. `అబద్ధం` ఆడేసి మూడు ముళ్లు వేసేస్తే.. ఎలా ఉంటుంది..? ఇదిగో ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీలానే ఉంటుంది.
ముంబైలో ఓ యువతికి, ఓ యువకుడికి 2016లో పెళ్లి జరిగింది. ఈ సమయంలోనే వరుడి తరఫువారు.. 100 అబద్ధాలు చెప్పలేదు కానీ.. ఒకే ఒక నిజాన్ని మాత్రం దాచేశారు. అదే.. సదరు వరుడు `గే` అంటే స్వలింగ సంపర్కుడు!! ఈ నిజాన్ని దాచేసి.. పెళ్లి చేసేశారు. పాపం ఇది తెలియని ఆమె.. తన భర్తతో సెక్స్‌లో ఎంజాయ్ చేయాలని కలలు కనింది. కానీ, ఎంతకీ పక్కమీదకి రాడే.. వచ్చినా పక్కకు తిరిగి పడుకుంటాడే!
ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే.. అల్లుబు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో వారు నచ్చజెప్పారు. పాపం ఎన్నేళ్లని ఎదురు చూస్తుంది.. వెంటనే విడాకులు ఇప్పించాలని కోర్టుకు వెళ్లింది. పెళ్లయిన తర్వాత ఆయనకు దగ్గరయ్యేందుకు ఎంత ట్రై చేసినా ఫలితం లేకపోయిందని, ఆయనకు పురుషులతో శారీరక సంబంధాలు ఉన్నాయని కోర్టుకు చెప్పింది.
అంతేగాక తనను శారీరకంగా వేధిస్తున్నాడని, దుర్భాషలాడుతూ తన ఆర్థిక పరిస్థితి, కుటుంబాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది. దీంతో `గే` అన్న నిజం దాచినందుకు సీరియస్ అయిన కోర్టు భర్తపై సీరియస్ అయింది. భార్యకు రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని, అలాగే ప్రతి నెల రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. ఇదీ.. నిజం దాచిన ఫలితం!