ఈ రోజుల్లో కొందరు మహిళలు(అందరూ కాదు) ఈజీ మనీకోసం అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో వారికి సెక్స్ యాప్‌లు వరప్రదాయినిగా మారుతున్నాయి. దీంతో ఇంట్లో కూర్చిని తీరిక సమయంలో అర్ధనగ్న, నగ్న ప్రదర్శనలు చేస్తూ.. అశ్లీల సంభాషణలు చేస్తూ.. భారీగా డబ్బులు పోగేసుకుంటున్నారు. కొన్ని కేసులు బహిర్గతమైనప్పుడు.. మహిళలు అడ్డంగా బుక్కవుతున్నారు. దీంతో కాపురాలు సైతం కూలిపోతున్నాయి.
తాజాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో ఉన్న ఫైజాబాద్‌కు చెందిన ఓ వివాహిత యువకులతో ఓ యాప్‌లో సెక్స్ చాట్ చేస్తోంది. అలా ఓ యువకుడితో మాట్లాడుతూ అతడికి దగ్గరైంది. ఓ రోజు వీడియోకాల్‌లో మహిళ అసభ్య ఫొటోలను తీశాడు. డబ్బులివ్వకపోతే ఈ ఫొటోలను భర్తకు పంపుతానని బ్లాక్మెయిల్ చేశాడు. అందుకు మహిళ అంగీకరించకపోవడం వల్ల ఆమె ఫొటోలను భర్తకు పంపాడు.
ఇదే అదునుగా చేసుకున్న ఆమె భర్త.. మహిళను వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించాడు. తన స్నేహితులతో గడపాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు లఖ్‌నవూ ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోసం దరఖాస్తు చేసుకుంది. దీనిని వాదించేందుకు అంగీకరించిన న్యాయవాది.. సిద్ధాంత్ కుమార్ ఇలాంటి తరహా కేసు తొలిసారి చూస్తున్నానని తెలిపారు.
సెక్స్ చాట్ల ద్వారా ఈమె నెలకు రూ.80 వేల నుంచి రూ.10లక్షల వరకు సంపాదించేదని చెప్పారు. ‘సోషల్ మీడియాలో తన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయని.. అందుకే తనకు డబ్బులు వస్తున్నాయని భర్తకు చెప్పేది. వీడియోలకు వచ్చే లైక్‌ల ఆధారంగా తనకు ఓ యాప్ వాళ్లు డబ్బులు ఇస్తున్నారని చెప్పింది’ అని సిద్ధాంత్ కుమార్ వివరించారు.
మహిళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బును కాజేయాలని ఆమె భర్త ప్రయత్నించాడు. భార్య బ్యాంకు ఖాతాలన్నింటినీ బ్లాక్ చేశాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో ఆమెకు విడాకులు ఇచ్చేందుకు అతడు ఇష్టపడలేదు. దీంతో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో మహిళకు కోర్టు కౌన్సెలింగ్ ఇచ్చింది. డబ్బుల విషయంలో ఆశపడి తాను పెద్ద తప్పు చేశానని మహిళ స్వయంగా అంగీకరించింది.