లోకం తీరు మారిపోయింది. పెళ్లి తంతు మారిపోయింది. అమ్మాయిలకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చాక అబ్బాయిలను అమ్మాయిలు లెక్కచేయడం లేదు అని మాజీ నటి రాధిక సంచలన వ్యాఖ్యలు చేశారు.
చేతిలో డబ్బులున్నాయి. వైద్య టెక్నాలజీ వల్ల భర్త లేకుండా పిల్లల్ని కనే అవకాశం రావడంతో నాకు మొగడు ఎందుకు? అని అంటున్నారు. ఈ మధ్య ఒక హీరోయిన్ నన్ను ఈ ప్రశ్న వేసింది.
లోకం పోకడ మారిపోయింది. మైండ్ సెట్ చేంజ్ అయ్యింది. చాలామందికి పెళ్లి చేసుకోవాలా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతోంది అని రాధిక చెప్పుకువచ్చింది.
ఇంతకీ ఎవరా హీరోయిన్ అన్న చర్చ ఇపుడు నడుస్తోంది. మరి ఆమె ఎవరు? మొగుడు ఎందుకు అవసరం నాకు అని రాధికతో చెప్పిన ఆ హీరోయిన్ ఎవరబ్బా?
ఇదేకాదు… పెళ్లి గురించి రాధిక చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ వీడియోలో చూడండి.