తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు తీన్మార్ మల్లన్న. పొద్దుపొద్దున్నే పేపర్లు పట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పు పట్టే ఆయన పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న అభిమానం ఏ స్థాయిదన్న విషయం తాజాగా వెల్లడైన నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక స్పష్టం చేసింది.
తెలంగాణ తేవటంలో కీలకభూమిక పోషించిన కోదండం మాష్టారిని కాదని మరీ తీన్మార్ మల్లన్నకు భారీగా ఓట్లు వేసిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. మల్లన్న ఓటమిని జీర్ణించుకోలేక ఆయన అభిమాని ఒకరు బోజనం చేయకుండా.. పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్న వైనం తెలిసిందే. నల్గొండ జిల్లాలోని లెంకలపల్లిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది.
తన ఓటమిని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్న శ్రీశైలం కుటుంబాన్ని తాజాగా పరామర్శించారు మల్లన్న. ఎన్నికల సందర్భంగా మల్లన్న చేపట్టిన పాదయాత్రలో మూడు నెలలు కళాకారుడిగా పని చేసిన శ్రీశైలం మరణంపై మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు.
తాజాగా శ్రీశైలం కుటుంబ సభ్యుల్ని ఓదార్చిన మల్లన్న.. రూ.50 వేల ఆర్థిక సాయాన్ని.. బాధితుడి చెల్లెలు పెళ్లికి రూ.లక్ష చెక్కును అందజేశారు. మల్లన్నను చూసినంతనే శ్రీశైలం కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. దీంతో.. మల్లన్న సైతం ఎమోషనల్ కు గురయ్యారు.