ఆంధ్రప్రదేశ్ లో ఇటు రాజకీయ పరంగా అటు సినీ రంగం పరంగా చరిత్రాత్మక నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన నారా బ్రాహ్మణి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తన తండ్రి, తాత, మామయ్య, భర్తల ఇమేజ్ ను ఏ మాత్రం ఉపయోగించుకుకోకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు బ్రాహ్మణి. వ్యాపారంలో తనకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ తమ సంస్థను అగ్రగామిగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు బ్రాహ్మణి.
తన తెలివి తేటలు, స్వయంకృషి, ప్రణాళికలతో అనతికాలంలో విజయవంతమైన వ్యాపార వేత్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు బ్రాహ్మణి. ప్రఖ్యాత స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యనభ్యసించిన నారా బ్రాహ్మణి హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, సక్సెస్ పుల్ ఎంటర్ ప్రెన్యూర్ గా దూసుకుపోతున్నారు. హెరిటేజ్ తరఫున సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే, ఇంత టాలెంట్ ఉన్న నారా బ్రాహ్మణిలో ఒక ప్రొఫెషనల్ బైక్ రైడర్ అన్న సంగతి చాలామందికి తెలియదు.
ఒక ప్రొఫెషినల్ బైక్ రైడింగ్ గ్రూపులో బ్రాహ్మణి మెంబర్‌గా ఉన్నారన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ –లడక్‌లో బైక్ నడుపుతున్న బ్రాహ్మణి వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో బ్రాహ్మణి స్వయంగా మాట్లాడడం, తాము బైక్ పై లెహ్ నుంచి మరోచోటికి వెళ్తున్నామని చెప్పడం విశేషం. పొద్దున్నే 6.30కు లేహ్ లో ఉన్నామని, అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని బ్రాహ్మణి చెప్పారు. ‘ది లడక్ క్వెస్ట్’ అనే బైక్ రైడింగ్ కార్యక్రమంలోనే బ్రాహ్మణి పాల్గొన్నట్లుగా కనిపిస్తోంది.
నారా బ్రాహ్మణి వదినమ్మ..
ఒక ప్రొఫెషనల్ బైకర్…
Passionate Travalleryes మీరు విన్నది, చూసేది నిజమే..
జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ – లద్దక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియా లో ట్రావెల్ చేశారు.వాళ్ల ట్రావెల్ experiance ఎలా ఉందో వాళ్ల మాటల్లోనే చూసేయండి????#HOPEKolli
1/4 pic.twitter.com/SNRuAwleAp— KOLLI DURGA VARA PRASAD (@hopekolli_babu) November 30, 2022