వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రభుత్వ ఛీఫ్ డిజిటల్ డైరక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీతలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లోకేష్ మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
ఈ ఏడాది ఆగష్టులో లోకేష్ పిన్ని, దివంగత ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్ సంధర్బంలో గుర్రంపాటి దేవేంధర్ రెడ్డి లోకేష్‌పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారని తెలిపారు.
ఉమామహేశ్వరి మరణానికి జూబ్లిహిల్స్ రోడ్డు నెం.45 సర్వే నెం. 273, 274, 275, 276 లలోని 5.73 ఎకరాల భూమి వివాదమే కారణం అని అనుచిత రాతలు రాశారని లోకేష్ పేర్కొన్నారు. అసలు ఆ సర్వే నంబర్లే ఫేక్ అని తేలడంతో గుర్రపాటి దేవేందర్ రెడ్డి మరో కట్టుకథ అల్లి హెరిటేజ్ లో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఉమామహేళ్వరిని మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని తప్పుడు రాతలు రాసి పరువునష్టం కలిగించడంతో క్రిమినల్ కేసు వేసినట్లు లోకేష్ తెలిపారు.
ఈ ఏడాది సెప్టెంబరులో తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. చంద్రబాబుని సారా చంద్రబాబు నాయుడిని అని పిలవాలని పిలుపునిచ్చారని లోకేష్ తెలిపారు. హెరిటేజ్ సంస్ధ ద్వారా వ్యాపారం చేస్తున్నామని చెబుతూ సారా పరిశ్రమ నడుపుతున్నారని ఆమె వ్యాఖ్యానించారన్నారు.
బీ-3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని వీరు రాష్ట్రంలో సారా ఏరులై పారించి కోట్లు గడించారని తప్పుడు వ్యాఖ్యలు చేశారు. భువనేశ్వరి, బ్రాహ్మణి తాగి కొట్టుకున్నారని వార్తల్లో వచ్చింది. పప్పు నాయుడు లోకేష్ కి మగువ, మందు లేనిదే నిద్ర పట్టదంటూ.. చంద్రబాబు, లోకేష్ లకు మందు తాగనిదే మాట పెగలదని సునీత వ్యాఖ్యానించారు.
మీడియా ముందు ఏం మాట్లాడాలన్నా మందు తాగి వచ్చేవాళ్లు అంటూ చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్ మంగళగిరి కోర్టులో దాఖలు చేసిన క్రిమినల్ కేసులో పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా మీడియా సమావేశానికి సంబంధించిన వీడియో, సాక్షి పత్రికల్లో ప్రచురితమైన కధనాలు లోకేష్ జత చేసి కోర్టుకు సమర్పించారు. దీనిపై ఐపిసి సెక్షన్ 499, 500 ల ప్రకారం గుర్రంపాటి దేవేంధర్ రెడ్డి, పోతుల సునీతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.