ప్రత్యర్థులు వేసే రాజకీయ వ్యూహాలకు ప్రతివ్యూహాలు వేయడంలో టీడీపీ ఎక్కడో కొంత మేరకు గాడితప్పు తోందనే వాదన మేధావి వర్గాల నుంచి జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. వైసీపీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఫీలవుతోంది. ఇక, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికారంలో ఉన్నట్టుగా భావిస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల్లో టీడీపీనే ఎక్కువగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందనేది పరిశీలకుల మాట.
వైసీపీ విషయాన్ని తీసుకుంటే.. పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు.. 22 పార్లమెంటు స్థానాలు.. దక్కాయి. అయి నప్పటికీ.. జగన్ మాత్రం తన పార్టీలోని ప్రతి ఒక్క నేతను కూడా.. మంత్రులతో సహా.. ప్రజల మధ్యకు పంపి స్తున్నారు. గడప గడపకు కార్యక్రమాన్ని జోరుగా సాగిస్తున్నారు. అసలు నేను మోనార్క్‌ని.. అన్న మాజీ మంత్రులను కీలక నేతలను కూడా వైసీపీ అధినేత రోడ్డు బాట పట్టించారు. ప్రజల మధ్య నిలబెట్టారు.
ఇప్పుడు.. ఇలాంటి కార్యక్రమాన్ని.. చంద్రబాబు అండ్ కో ప్రారంభిస్తే బెటర్ అని అంటున్నారు పరిశీలకు లు. ఎందుకంటే, ప్రజలకు ప్రభుత్వాలు చేసిన మంచిని గుర్తు పెట్టుకునే తీరిక లేదని ఏడాదిన్నర ముందుగానే వైసీపీ అధినేత గుర్తించారు. అందుకే ఆయన ప్రతి ఇంటికీ తన నేతలను తిప్పి.. లబ్ధిని వివరిస్తు న్నారు. దీంతో ఆ రెపో అలానే కొనసాగుతోంది. మరి అదేసమయంలో వైసీపీ వ్యతిరేకత పెంచాలని భావిస్తున్న టీడీపీ మాత్రం కేవలం పర్యటనలతోనే సరిపుచ్చుతోంది.
ఈ క్రమంలో ఇప్పటికైనా.. ఇలాంటి అదిరిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనేది తమ్ముళ్ల మాట. ప్రజ ల్లో ఉండడం అంటే.. ప్రజల ఇళ్లకు నిరంతరం వెళ్లడం.. వారి సమస్యలు తెలుసుకోవడం, పరిష్కారానికి ప్రయత్నించడం వంటివి కీలకంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాపీ కొట్టారు అనుకున్నా.. ఫర్వాలేదు… వైసీపీ చేస్తున్న ఇలాంటి కార్యక్రమం మన కూ కావాలని తమ్ముళ్లు కోరుతున్నారు. తాజాగా దీనిపైనా చర్చించనున్నట్టు తెలుస్తోంది.