కొద్దిరోజుల క్రితం జరిగిన ‘చోర్ బజార్’ సినిమా రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లాం, పిల్లలను పట్టించుకోని వాడు అసలు మనిషా అంటూ పూరి జగన్నాథ్ ను ఉద్దేశించి స్టేజిపైనే బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపాయి. అయితే, బండ్ల గణేష్ వ్యాఖ్యలపై డైరెక్ట్ గా స్పందించని పూరీ జగన్నాథ్..తన మ్యూజింగ్స్ ద్వారా ఇన్ డైరెక్టుగా ఒక మెసేజ్ పెట్టారు.
మన నాలుక కదులుతున్నంతసేపు మనం ఏమీ నేర్చుకోలేమంటూ పూరీ అన్నారు. ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఆఖరికి భార్య ముందైనా సరే ఆచితూచి మాట్లాడాలని, చీప్ గా వాగి చీప్ గా బిహేవ్ చేయకూడదని పూరీ క్లాస్ పీకారు. అయితే, ఆ ఆడియోలో బండ్ల గణేష్ ప్రస్తావన లేదుగానీ ఆ మాటలు ఆయనను ఉద్దేశించే పూరీ చేసి ఉంటారని చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే పూరీ కామెంట్స్ గురించి బండ్ల గణేష్ కు ప్రశ్న ఎదురైంది.
దీంతో, మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు బండ్ల. నాలుగు జాగ్రత్తగా పెట్టుకో అని పూరి ఎందుకు స్పందించారంటూ ఓ యూట్యూబ్ చానెల్ యాంకర్ అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ సీరియస్ గా రిప్లై ఇచ్చారు. పూరీ జగన్నాథ్ తన ఫ్రెండ్ అని, అతనికి మంచి చెడు చెప్పే రైట్ తనకు ఉందని బండ్ల గణేష్ అన్నారు. ఈ రకంగా తన వ్యాఖ్యలను బండ్ల గణేష్ మరోసారి సమర్ధించుకున్నారు. పోసాని చావు మామూలుగా ఉండదని చెప్పడానికి మీరెవరు అంటూ బండ్ల గణేష్ ను యాంకర్ ప్రశ్నించారు. అయితే, యాంకర్లు పెట్టే బోనులో బండ్ల గణేష్ పడడని ఆయన అన్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో వైరల్ అవుతోంది.