ఇటీవల కాలంలో ఇంతకాలం వినని సిత్రాలు బోలెడన్ని తెర మీదకు వస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది తాజా ఉదంతం. పెళ్లైన 8 ఏళ్ల తర్వాత తన భర్త ‘అతడు’ కాదు ‘ఆమె’ అంటూ ఒక భార్య చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది. గుజరాత్ లోని వడోదరలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులకు ఇచ్చిన తాజా కంప్లైంట్ బయటకు రావటంతో ఈ ఉదంతం సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత తన భర్త మగాడు కాదని.. శస్త్రచికిత్స ద్వారా మగాడిగా మారిన మహిళగా గుర్తించిన భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది.
అసహజ శృంగారం.. మోసం లాంటి అభియోగాలతో తన భర్తపై ఒక మహిళ గోత్రి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చింది. పెళ్లిళ్ల వెబ్ సైట్ ద్వారా తామిద్దరికి పరిచయమైందని.. 2014 ఫిబ్రవరిలో తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. హనీమూన్ కోసం తామిద్దరం కశ్మీర్ కు కూడా వెళ్లినట్లుగా సదరు మహిళ పేర్కొన్నారు. తనతో చాలాకాలం పాటు దూరంగా ఉంటూ తరచూ ఏదో ఒక సాకు చెప్పేవాడన్నారు.
ఆ తర్వాతి కాలంలో భర్తను నిలదీయటంతో తాను రష్యాలో ఉన్నప్పుడు జరిగిన ప్రమాద కారణంగా తాను శృంగార సామర్థ్యాన్ని కోల్పోయినట్లుగా చెప్పారన్నారు. తర్వాత 2020లో పొట్ట తగ్గేందుకు సర్జరీ పేరుతో కోల్ కతాకు వెళ్లి.. పురుష అవయువాల కోసం శస్త్రచికిత్స చేయించుకున్నట్లుగా భార్య తన ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత నుంచి ఆమెతో అసహజ రీతిలో శృంగారం చేయటం ప్రారంభించాడని.. చివరకు అతడు కాదని ఆమె అని తెలియగా.. ఆ విషయాన్ని బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లుగా పోలీసులకు ఆమె చెప్పారు. అసలు విషయాల్ని దాచి పెట్టి పెళ్లి చేసిన అత్తారింటి వారిపైనా ఆమె కంప్లైంట్ ఇచ్చారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో భర్తను ఢిల్లీలో అరెస్టు చేసి..వడోదరకు తరలించారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.