అమరావతిపై వైసీపీ అధినేత, నేతలు అబద్ధం ఆడింది నిజం
అది కమ్మోళ్లది అని అబద్ధాన్ని ప్రచారం చేసిన మాట నిజం
ఇపుడు మూడు రాజధానులు అనేది కూడా ఓట్ల కోసం వేస్తున్న గేలమే అన్నది నిజం
వారు ఎంత ప్రయత్నించిన మూడు రాజధానులకు మద్దతు రావడం లేదన్నది నిజం
దీంతో టీడీపీ నేతలు అమరావతిలో భూములు రాజధాని ప్రకటనకు ముందే కొన్నారు అంటూ ఒక అబద్ధాన్ని వైసీపీ పదేపదే చెబుతోంది. ఎవరో ఒకరు నమ్మకపోతారా అన్న ఆశతో.
ఈ నేపథ్యంలో పయ్యావుల రాజధానిలో భూములు కొన్నారంటూ చేసిన ప్రచారంపై తీవ్రంగా స్పందించిన పయ్యావుల…. నేను రాజధాని ప్రకటనకు ముందు కొన్నాను అని మీరు నిరూపిస్తే అసెంబ్లీలోనే ఆ భూములు గిఫ్ట్ గా రాసిస్తాను అని సంచలన ప్రకటన చేశారు.
అబద్ధాలు ప్రచారం చేయడం కాదు… దమ్ముంటే అమరావతి కట్టండి, లేకపోతే పక్కకు తప్పుకోండి అని ఛాలెంజ్ విసిరారు పయ్యావుల. అది ఆయన మాటల్లోనే వినండి.