ఎన్నో ఆశలు.. అంతకు మించిన ఆకాంక్షలు.. తాము అభిమానించే పూరీ.. ఆరాధించే రౌడీ కాంబినేషన్ లో బాలీవుడ్ సెలబ్రిటీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఫిల్లర్ గా నిలిచిన వేళ.. సినిమాను పుష్ చేసేందుకు పెద్దగా ప్రయాస పడాల్సిన అవసరం లేదు. అందునా.. విజయ్ ను అమితంగా అభిమానించే వారికి లైగర్ ఫలితం పెను షాక్ గా మారటమే కాదు.. దాని నుంచి ఎలా బయట పడాలన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
అందరి అంచనాలన్ని భిన్నంగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావటం ఒక ఎత్తు అయితే.. మొదటి షో పూర్తి అయ్యేసరికి..సినిమా మీద రివ్యూలు వైరల్ గా మారటం.. ఎవరికి వారు సిసిమాను చీల్చి చెండాడేస్తున్న పరిస్థితి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించినట్లుగా చెప్పుకున్న లైజర్ మూవీ అనుభవం కూడా ఇదే తీరులో ఉండటం తెలిసిందే. దీంతో.. ఈ సినిమా విజయం మీద కోటి ఆశలు పెట్టుకున్న ప్రముఖులంతా తీవ్ర నిరాశకు గురయ్యేలా చేసింది తుది ఫలితం.
ఈ బాధలు సరిపోవన్నట్లు ఈ మూవీకి మరో తలనొప్పి కొత్తగా మొదలైనట్లు చెబుతున్నారు. కథ.. స్క్రీప్లే పూర్ గా ఉండటం.. దర్శకత్వంలో పూరీ ఆలోచనలు సరిగా ఎస్టాబ్లిష్ కాకపోవటంతో సినిమా దారుణమైన ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. కొంతలో కొంత ఊరట కలిగించే అంశం ఏమంటే.. ఈ మూవీలో హీరో విజయ్ దేవరకొండ నటన.. ఈ సినిమా కోసం తీసుకున్న శ్రద్ధ విషయంలో ఆయనకు బోలెడన్ని మార్కులు పడ్డాయి.
ఈ ఇబ్బందులు సరిపోనట్లు ఐఎండీబీ రేటింగ్ లోనూ లైగర్ కు దిమ్మ తిరిగే షాకులు మొదలయ్యాయి. ఐఎండీబీ రేటింగ్ లో లైజర్ అతి తక్కువ రేటింగ్ దక్కించుకున్న మూవీగా పేర్కొన్నారు. ఈ మూవీకి 1.8 రేటింగ్ ఇచ్చారు. ఈ మూవీలో చాలా సందర్భాల్లో పూరీ మార్కు కనిపించలేదన్న విమర్శ ఉంది.
ఇక.. బాయ్ కాట్ ముద్దతుతో లాల్ సింగ్ చడ్డాకు (5) రేటింగ్ ఇవ్వగా.. అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ (4.6).. దొబారా (2.9) .. షంషేరాలకు (4.9) ఇచ్చారు. దీనికి సంబంధించిన వార్తాంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా చూసినప్పుడు లైగర్.. ప్లాప్ మాస్టర్ గా మారిన లాల్ చంద్ చడ్డా కంటే వెనుకబడి ఉండటం మరింతగా బాధించింది. మరీ.. కష్టాలను ఎప్పటికి అధిగమిస్తారో చూడాలి.
Comments 1