తాజాగా అమరావతి బాండ్లకు సంబంధించిన ఓ వార్త వెలుగు చూసింది. అమరావతి బాండ్లకు రేటింగ్ అన్నది ఒక్కసారిగా పడిపోయింది. ఏ ప్లస్ నుంచి ఏ మైనస్ కు పడిపోయింది. దీనినే ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ గుర్తించి, ప్రకటించిందని ప్రధాన మీడియా చెబుతోంది. వాస్తవానికి అమరావతి బాండ్ల విషయమై మొదట్లో మార్కెట్లో మంచి క్రేజ్ ఉండేది. వీలున్నంత వరకూ వీటిని సొంతం చేసుకునేందుకు చాలా మంది మొగ్గు చూపారు.
గత ప్రభుత్వం కూడా దీన్నొక సంపద సృష్టి కేంద్రంగానే చూసింది. ఆ విధంగానే అభివృద్ధి పనులు కూడా చేపట్టింది. ముఖ్యంగా అమరావతి బాండ్ల వేలంతోనే ఎక్కువ ఆదాయాన్ని పొంది తద్వారా రాజధాని అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం భావించింది. కానీ బాండ్లకు సంబంధించిన నిల్వలు ఇప్పుడు లేవని, ఆశించిన స్థాయిలో వడ్డీ రేటు జమ కావడం లేదు అని అందుకే వీటి తాలుకా రేంజ్ తగ్గిపోయిందని, డిమాండ్ తగ్గిపోయిందని తద్వారా రేటింగ్ పడిపోయిందని తెలుస్తోంది.
రాజధాని నిర్మాణం చేపట్టకపోగా, రాజధానికి సంబంధించి అప్పట్లో సేకరించిన బాండ్ల విలువను కూడా క్రమ క్రమంగా తగ్గించేసింది.ముఖ్యంగా ఎప్పటి నుంచో చెప్పిన విధంగానే బాండ్లకు సంబంధించి నిధులను కూడా మళ్లింపు చేశారా లేదా అస్సలు ఆ నిధులు అన్నవి లేకుండా చేసేశారా అన్న అనుమానాలూ ఉన్నాయి.
అరకొర ఆర్థిక వృద్ధితో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కొత్త పెట్టుబడులు రాకపోగా., గతంలో మన ప్రభుత్వాలపై ఉన్న కాస్త నమ్మకాలు కూడా ఇప్పుడీ విధంగా పోతున్నాయని విపక్షం ఆవేదన చెందుతోంది. ఆర్థిక పరిస్థితులు మందగమనంలో ఉండడంతోనే క్రిసిల్ సంస్థ అమరావతి బాండ్లకు ఉన్న రేటింగ్ ను తగ్గించిందని ప్రధాన మీడియా అంటోంది. వివరిస్తోంది.