అమరావతి భూ కుంభకోణంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్లో చంద్రబాబునాయుడుకు నోటీసులు అందాయి. భూ కుంభకోణంపై విచారణకు హాజరవ్వాలని కోరుతు రెండు బృందాలుగా సీఐడీ ఉన్నతాదికారులు హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటకి వెళ్ళారు. అయితే సీఐడీ అధికారులను చంద్రబాబు సెక్యురిటి లోపలకు అనుమతించలేదు. దాంతో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది.
అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబుదే కీలకపాత్రగా మొదటినుండి రాష్ట్రప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. 2014లో చంద్రబాబు సీఎం కాగానే భారీ ఎత్తున భూ కుంభకోణానికి తెరలేచిందని అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి వస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ కూడా చేయిస్తామని జగన్మోహన్ రెడ్డి గతంలో చాలా సార్లు ప్రకటించారు.
అప్పుడు చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే భూ కుంభకోణంపై విచారణలు మొదలుపెట్టారు. అయితే విచారణను టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు. దాంతో స్టే వెకేట్ చేయించేందుకు రాష్ట్రప్రభుత్వం సుప్రింకోర్టుకెళ్ళింది. ప్రభుత్వం లెక్కల ప్రకారం అమరావతి ప్రాంతంలో సుమారుగా 4070 ఎకరాల్లో కుంభకోణం జరిగింది. రాజధానిగా అమరావతిని ప్రకటించేముందే తన మద్దతుదారులు, సన్నిహితుల్లో కొందరితో పెద్ద ఎత్తున భూములు కొనిపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఒకవైపు సుప్రింకోర్టులో ఇదే విషయమై స్టే ఉంది. మరి ఇంతలోనే విచారణ కోరుతు సీఐడీ ఉన్నాతాధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటం ఆసక్తిగా మారింది. చంద్రబాబుతో పాటు ఇంకెంతమందికి సీఐడి అధికారులు నోటీసులు ఇస్తున్నారనే విషయంలో స్పష్టత లేదు.