జూలై 1-3 వరకు వాషింగ్టన్లో ఘనంగా జరగనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 17వ సభలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ కాన్ఫరెన్స్ మరియు యూత్ కన్వెన్షన్ కు అమెరికాలోని 50 రాష్ట్రాల నుండి 15,000 మందికి పైగా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలకు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
తెలంగాణ నుంచి ఇప్పటివరకు ఆహ్వానం అందిన రాజకీయ నాయకుల్లో ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ దయాకర్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ డీ అరవింద్, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తదితరులను ఆహ్వానించారు.
అయితే, వీరిలో కొందరు మాత్రమే హాజరవుతున్నారు. సభలను ఎమ్మెల్సీ కవిత ఘనంగా ప్రారంభించింది. 17 వ ATA కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి ఇండియా నుండి అమెరికా చేరుకుంటున్న ప్రత్యేక అతిథులతో వాషింగ్టన్ డీసీ కళకళలాడుతుంది.
@Rakulpreet leaving to USA for the 17th ATA (American Telugu Association ) convention
A golf session and further culture activities will happen ❤️ #RakulPreetSingh pic.twitter.com/IQ9r2bJ0mE— RakulxMagic (@RakulxMagic) June 30, 2022
సద్గురు జగ్గీ వాసుదేవ్, మాజీ క్రికెటర్లు గవాస్కర్, కపిల్ దేవ్, క్రిస్ గేల్, హీరో అడవి శేష్, నటి రకుల్ ప్రీత్ హాజరయ్యారు. వీరితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ టీం, గాయకులు శ్రీకృష్ణ , సునీత, మనీషా ఈరభతిని, మంగ్లీ, గీత రచయితలు చంద్రబోస్, రామజ్యోగయ శాస్త్రి , శేఖర్ మాస్టర్, పద్మశ్రీ పద్మజ గారు, కూచిపూడి కళాకారుల బృందం, తనికెళ్ల భరణి గారు, ఉపాసన కొణిదెల, యాంకర్లు శ్రీముకి , రవి , ఇల్యూషనిస్ట్ బి ఎస్ రెడ్డి ఇప్పటికే వాషింగ్టన్ చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, TRS లీడర్ కుసుమ జగదీశ్వర్, మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ , మిమిక్రీ ఆర్టిస్ శివా రెడ్డి, కూచిపూడి గురువు డా. హలీం ఖాన్ మరియు అనేకమంది రాజకీయ నాయకులు కళాకారులు ఇప్పటికే వాషింగ్టన్ DC చేరుకోగా వారికి ATA టీం ఘన స్వాగతం పలికారు .
ATA ప్రెసిడెంట్ భువనేశ్ భూజాల, కన్వీనర్ సుధీర్ బండారు, స్వయంగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి అతిధులకు స్వాగతం పలుకుతున్నారు.
ఈ శుక్రవారం నుండి ఆదివారం వరకు జరిగే వేడుకల కోసం వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ ఎన్నో హంగులతో ముస్తాబయింది. అమెరికా నలు మూలాల నుండి తెలుగు వారు హాజరవుతున్న ఈ వేడుకలు శుక్రవారం ఉదయాన్నే గోల్ఫ్ టోర్నమెంట్ , యూత్ క్రికెట్ టోర్నమెంట్ తో ఘనంగా ప్రారంభం అయ్యాయి.
శుక్రవారం సాయంత్రం జరగబోయే డిన్నర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఈ డిన్నర్ కి సెలబ్రిటీ అతిధులు అందరూ హాజరు కానున్నారు.
https://www.youtube.com/watch?v=4Eim4Ho_yc0&ab_channel=TV9USA
https://www.youtube.com/watch?v=r1s6lS3SL_s&ab_channel=LegendTvEntertainment