పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడి అధికార పార్టీ విజయం సాధించిందని టీడీపీ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిిందే. అయితే, పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలు సాగవని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ ఎన్నికల్లో కూడా బలవంతపు నామినేషన్ విత్ డ్రాలు, టీడీపీ అభ్యర్థులకు బెదిరింపులు ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో తమ గెలుపు అవకాశాలపై వైసీపీ ఓ రహస్య సర్వే చేపట్టింని తెలుస్తోంది.
ఈ సర్వే ఫలితాలు వైసీపీకి షాక్ తగిలేలా చేశాయని తెలుస్తోంది. ఏపీలోని మొత్తం 12 కార్పొరేషన్లకు గాను తిరుపతి, చిత్తూరు, కడప ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయని ఆ సర్వేలో తేలిందట. ఇక, మిగతా 9 కార్పొరేషన్లలో టైట్ ఫైట్ తప్పదని, ఆ 9 కార్పొరేషసన్లలో 7 కార్పొరేషన్లు టీడీపీకి దక్కే అవకాశముందని తేలడంతో వైసీపీ అధినేత జగన్ కు మైండ్ బ్లాంక్ అయిందట. తమకు అనుకూలంగా వస్తాయని భావించి చేపట్టిన సర్వేలో ప్రతికూల ఫలతాలు రావడం వైసీపీ నేతలు, శ్రేణులకు కూడా ఆశ్చర్యం కలిగించిందట.
దీంతో, కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం మరింత గట్టిగా కృషి చేయాలని వైసీపీ నేతలు, కార్యకర్తలకు జగన్ హుకుం జారీ చేశారట. ఆ సర్వే ప్రకారం ముఖ్యంగా వైసీపీ గంపెడాశలు పెట్టుకొని, పాలనా రాజధాని చేయాలనుకుంటోన్న విశాఖలో గట్టి పోటీ తప్పదట. జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఘాటు వైసీపీకి తగలబోతోందని తేలిందట.
వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 98 డివిజన్లలో 35 డివిజన్లు టీడీపీ గెలుచుకునే చాన్స్ ఉందని, వైసీపీ 40 డివిజన్లు దక్కించుకునే అవకాశముందని, మరో 23 డివిజన్లలో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతోందని సర్వేలో తేలిందట. దీంతోపాటు, అమరావతి రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ వైసీపీకి షాక్ తగిలే అవకాశముందట.
రసవత్తరంగా మారిన బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 64 డివిజన్లుండగా…వాటిలో 28 వైసీపీ, 31 టీడీపీ గెలుచుకునే చాన్స ఉండగా…5 స్థానాల్లో నువ్వా నేనా అన్నట్టు పోలింగ్ జరగనుందట. మరి, ఈ సర్వే ఫలితాలు నిజమైతే వైసీపీ నేతలకు గట్టి షాక్ తగులుందనడంలో ఎటువంటి సందేహం లేదు.