• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘తానా’ ఎన్నికల కోలాహలం

చీలిక దిశగా రెండు వర్గాలు ప్రచార ఉధృతి

admin by admin
March 20, 2021
in TANA Elections
0
tana elections

tana elections

0
SHARES
81
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలుగు సమాజ ఐక్యత దిశగా ‘గోగినేని’

‘తానా’ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు వచ్చిన సందర్భంగా ఎన్నికల సంగ్రామం ఏ విధముగా ఉండబోతుందో క్రమక్రమంగా స్పష్టమవుతోంది. గత వారాంతంలో జరిగిన బోర్డు మీటింగ్ రికార్డు స్థాయిలో 9 గంటల పాటు జరిగి, మరింత వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లు ఎక్కువమంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ తిరస్కరించిన ‘భక్త బల్లా’, ‘హేమచంద్ర కానూరి’ మరియు ‘సుమన్ రామిశెట్టి’ ల నామినేషన్లను బోర్డు కూడా తిరస్కరించినట్లు, ముగ్గురూ ఇంతకు ముందు నుంచి ‘తానా’ కు వివిధ పదవుల్లో పనిచేసి ఉన్న కారణంగానూ, తిరస్కరణకు గురైన విధానంలో కొన్ని వెసులుబాట్లు కారణంగానూ, బోర్డు ఆమోదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఫక్తు రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్లు ఎక్కువమంది భావించడం ‘తానా’ వంటి స్వచ్చంద సంస్థకు మేలు కాదని చెప్తున్నారు. అలాగే ‘బినామీ అడ్రస్ ప్రూఫ్’ లతో వివాదాస్పదమైన ‘4000 అడ్రస్ మార్పుల’ పై కూడా ‘న్యూట్రల్ థర్డ్ పార్టీ కమిటీ ‘కాకుండా ఇంటర్నల్ బోర్డు సభ్యులు మరియు వారి అనుచరులతో వ్యవహారం నడుపుతుండడం కూడా వివాదాస్పదంగానే ఉంది. ఈ పనికి మరికొంత సమయం పట్టే కారణంగా బాలట్లు పంపే సమయము మరి కొద్దిరోజులు ఆలస్యంకావచ్చునని తెలుస్తోంది. ఇక రెండు మూడు రాష్ట్రాల మినహా అన్నిచోట్లా స్థానిక ప్రతినిధుల ఎన్నికలు ఏకగ్రీవం కావటం ‘తానా’ తెలుగు సమాజానికి కొంత  ఊరటనిచ్చింది.

ఇక రెండువర్గాలుగా చీలి పోటీ పడుతున్న వారు తమ తమ వ్యూహాలకు పదును పెడుతూ అన్ని రాష్ట్రాలలో మద్దతుదారులను ఉత్సాహపరచుకొంటూ రెండో వర్గం పై నిఘా పెడుతున్నారు. ‘కొడాలి’ మరియు ‘శృంగవరపు’ వర్గాలు రెండూ కోవిడ్ విషయాన్ని కూడా లెక్క చేయకుండా అనేక నగరాలూ తిరుగుతూ పర్యటనలు ఖరారు చేసుకోవటం వారిద్దరికీ ఉన్న అభద్రతా భావాన్ని, అలాగే పోటీ వాతావరణాన్ని తెలియచేస్తోంది. స్వచ్చంద సంస్థల్లో సాధారణంగా పాటించే నియమాలకు విరుద్ధంగా ప్రస్తుత అధక్షుడు ‘జయ్ తాళ్లూరి’, అందరి మద్దతు సహాయ సహకారాలతో పోటీ లేకుండా పదవి పొందిన తదుపరి అధ్యక్షుడు ‘అంజయ్య లావు ‘బహిరంగంగా ఒక వర్గానికి వత్తాసు పలకటంపై అమెరికా వ్యాప్తంగా నిరసన వ్యక్తమైనప్పటికీ, తిరిగి అదే పని ఇంకా బహిరంగంగా చేస్తూ ఎన్నికల ప్రచారానికి వివిధ రాష్ట్రాలకు పర్యటన ఏర్పాట్లు చేసుకోవడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యం గా వారి స్వంత ప్రదేశాలైన అట్లాంటా, న్యూ యార్క్, న్యూ జెర్సీ లోనే కాక ,వారు వెళ్లే ప్రదేశాల్లోకూడా సభ్యులు వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. ఇది చివరికి ప్యానెల్ కు వ్యతిరేక పవనంగా మారే ప్రమాదం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నానికి ముఖ్య కారణము గా తాము సమర్ధించే  ప్యానెల్ మొత్తం లో ప్రముఖమైన లేదా లీడ్ చేయగల ఒక్క వ్యక్తి కూడా లేకపోవడం పెద్దలోపమని దానిని పూడ్చటానికి ఇంతకంటే వేరే మార్గం లేదని భావిస్తున్నప్పటికీ, ఇది కూడా వివాదాస్పదమై ఎదురు తిరుగుతుందేమోనని తర్జన భర్జన పడ్తున్నారు.

కొద్ధి నెలల క్రితం వరకు కలసి ఉండి అకస్మాత్తుగా రెండు వర్గాలుగా చీలి పూర్తి పానెల్స్ గా ఏర్పడి తెలుగు సమాజాన్ని రెండు వర్గాలుగా దీర్ఘకాలంపాటు చీల్చే విధంగా ప్రచారాలు జరుపుకోవడం పై చాలా మంది నిరసన వ్యక్త పరుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో , వివిధ వర్గాల పరిస్థితి ఏ విధంగా గోచరిస్తుందంటే–

శ్రీనివాస గోగినేని: వివాద రహితుడు, వర్గాలకు అతీతుడై గతం లో ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ తో పాటు, కాన్ఫరెన్స్ సెక్రటరీ, దీర్ఘ కాలం బోర్డు మెంబరు తో పాటు అమెరికాలోని అనేక నగరాల్లో  ‘మన ఊరికోసం’ నినాదం తో చేసిన ‘5కే వాక్/రన్’ లకారణం గానూ, గతంలోనే ఒకసారి అధ్యక్షపదవికి పోటీ చేసిన కారణంగానూ ఉన్న గుర్తింపు తోడై ,ప్రస్తుతం పోటీ లో ఉన్న వారందరిలోకీ ఉన్నతుడుగానూ, ప్రముఖుడు గానూ మరియు అర్హుడు గానూ ‘తానా’ సభ్యులధికులు భావిస్తుండడం బాగా కలసివచ్చింది. దానికి తోడు అన్నిరాష్ట్రాల్లో తనకున్న అభిమానులు, మద్దతు దారులను తనదైన పద్దతిలో సమన్వయపరచుకొంటూ, సామాజిక,పేపర్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తన అభిప్రాయాలకు, విధానాలకు ప్రాచుర్యం కలిపించుకొంటూ వర్గపోరాటాన్ని బహింరంగంగా ఖండించగలిగే ధైర్యం, నిబద్దత మూలంగా ‘తానా ‘సాధారణ సభ్యులకు హాట్ ఫేవరెట్ గా మారారు. తనకు ఎందుకు ఓటు వేయాలో చెపుతూ, మిగతా పదవులకు పోటీ చేస్తున్న వారిలో అత్యధికమంది తో సన్నిహిత సంబందాల వలన ఏ విధంగా ‘తానా’ లో ఐక్యత రాబట్టగలనో  స్పష్టంగా చెప్పుకుంటుండవలననూ,  ఆయనకు ఎందుకు ఓటు వేయకూడదు అనేది ప్రత్యర్థులు చెప్పలేకపోవడం వలన ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి అందరిలోకీ ముందు ఉన్నట్టే లెక్క

Dr.నరేన్ కొడాలి: తన ప్యానెల్ ముఖ్య సభ్యులైన ‘భక్త బల్లా’,’హేమా కానూరి’ ల నామినేషన్లను కూడా సమన్వయంతో సరిగ్గా వేయుంచుకోలేని పరిస్థితిలో, ఫక్తు రాజకీయాకారణాలతో బోర్డ్ వీరి నామినేషన్లను తిరస్కరించినప్పటికీ ,ఎటువంటి ప్రతిఘటనను గాని, ప్రత్యర్థి వర్గం ‘అడ్రస్ మార్పు’ వ్యవహారం లో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఎదుర్కునే పటిమ ఇప్పటివరకూ చూపించకపోవడంపై, అయన వర్గంలోనే  అయన నాయకత్వముపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమి జరుగుతోందో అర్ధంకాక తన ప్యానెల్ సభ్యులు కొంత నీరసంగానే ఉన్నట్లు, తాము నమ్ముకున్న నాయకత్రయం బాహు బలులా లేక బాహు బలహీనులా తేల్చుకోలేక సతమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సంస్థాగతంగా సాంప్రదాయకమైన ఓటు బ్యాంకు కొంతవరకు అన్నిచోట్లా ఉండడటం, అలాగే ప్రత్యర్థి వర్గానికి అటువంటి వెసులుబాటు లేక తాము చేర్పించుకొన్న వోట్లపైనే ఆధారపడటం కొంతవరకు వెసులుబాటు కాగా, ఇప్పటికైనా జాగ్రత్తగా వ్యవహరిస్తే, అవకాశాలున్నట్లే భావిస్తున్నారు.అలాగే ముఖాముఖీ పోటీ గాక అధఃక్ష స్థానానికి త్రిముఖ పోటీ ఉండడటం, నరేన్ కు ప్రత్యక్ష కార్యక్రమ నిర్వహణాలలో అంతగా ప్రజా సంబంధాలు లేకపోవడం మూలం గా వెనకబడే ప్రమాదం ఉందనుకుంటన్నారు.

నిరంజన్ శృంగవరపు: ప్రస్తుత కార్యవర్గాలలో మద్దతుఉండటం నైతికంగా బలంగా అనిపిస్తున్నప్పటికీ  వయసు, అనుభవము, గుర్తింపు రీత్యా ‘నిరంజన్’ మిగతా ఇద్దరిలో వెనుక బడి ఉండటంతో బాటు ఇదే కారణాలలో ‘శ్రీనివాస గోగినేని ‘మిగతా ఇద్దరికంటే ముందు ఉండటం  ఇబ్బందికరంగా ఉంది. పైగా బాహుబలుల ప్యానెల్ పై ఉన్న వ్యతిరేకతను  తమవైపు లాగుతానికి ప్రయత్నించినా, గత చరిత్ర లో వీరందరూ కలసి గుత్తాధిపత్యం చెలాయిస్తున్నప్పటి నించీ పోరాడున్న ‘గోగినేని’ కే వ్యతిరేకఓటు పడే పరిస్థితి లో ఎలా వ్యవహరించాలో తెలియక తికమక పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్షులు బహిరంగ మద్దతు పైకి బలంగా అనిపిస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఎంత ఉపయోగపడుతుందో నని  లెక్కలు వేసుకుంటూ ఊరట పడ్తున్నట్లున్నారు. వెరసి ప్రెసిడెంట్ అభ్యర్థికి  కొంత ఆందోళనకర పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్థున్నప్పటికీ, మిగతా ప్యానెల్ గట్టెక్కవచ్చని కంఫర్ట్ ఫీలవుతున్నారు కానీ తుది ఫలితం తమకు బలంగా భావిస్తున్న బాలెట్స్ కలెక్షన్స్ మీదే ఆధారపడి ఉండటం కొంత ఆందోళనకారమే.

నిజానికి ‘గోగినేని’ స్వచ్చంద ఓట్లపై నమ్మకం పెట్టుకోగా, రెండు వర్గాలు బాలట్ కలెక్షన్ల ప్రక్రియపై మల్లగుల్లాలు పడుతున్న ప్రస్తుత పరిస్థితిని కోవిద్ సమయంలో గమనిస్తున్న మనలాంటి వాళ్ళు పాడుకొనే పాట–

“అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా! నీ గుట్టు ఏమిటో తెలిసిందిలే, నీ బెట్టు దిగజారి పోతుందిలే! అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా!”

https://namasteandhra.com/tana-elections-campaign-candidates-running-around-voters-hide-and-go-seek/
Tags: NRITANATana electionsTelugu associations
Previous Post

జగన్ ను వణికిస్తోన్న రహస్య సర్వే…టీడీపీ ఖాతాలో ఆ 7 కార్పొరేషన్లు?

Next Post

బోస్టన్, న్యూజెర్సీ ‌లలో ‘Dr నరేన్ కొడాలి’ సుడిగాలి ప్రచారం

Related Posts

NRI

‘తానా’ ఎన్నికలు-సంచలన ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్’ తో బాలట్ కలెక్టర్ల ‘తాట’ తీస్తున్న ‘తానా’ బోర్డు!

February 12, 2023
TANA Elections

‘తానా’ లో మూడు ముక్కలాట-3

February 10, 2023
Andhra

ఉద్యోగులకు షాక్…కొత్త పీఆర్సీ రిలీజ్ చేసిన జగన్

February 20, 2022
NRI

‘తానా’ కార్యవర్గాల ముఖ్య పదవుల ఎన్నికలు పూర్తి

August 11, 2021
TANA
TANA Elections

ఫ్లాష్ న్యూస్: ‘తానా’ ఎన్నికల ప్రాసెస్ మరియు రిజల్ట్స్ పై అఫీషియల్ కంప్లైంట్ దాఖలు!

June 3, 2021
TANA Elections

‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ గా ‘రాజా కసుకుర్తి’ గెలుపు

June 3, 2021
Load More
Next Post
tana elections

బోస్టన్, న్యూజెర్సీ ‌లలో 'Dr నరేన్ కొడాలి' సుడిగాలి ప్రచారం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • NRI TDP-London-లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు!
  • ఢిల్లీలో మఠాధిపతులకు మోడీ మార్క్ రాచమర్యాదలు
  • వైసీపీ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్‌ను తిడితే ఊరుకుంటారా నానీగారూ!!
  • బాల‌య్య ఫొటోపై వైసీపీ యాగీ.. ఏం జ‌రిగిందంటే!
  • పొత్తుల‌పై తేల్చ‌ని చంద్ర‌బాబు.. కిం క‌ర్త‌వ్యం?!
  • పార్లమెంటు ప్రారంభోత్సవ వేళ.. తీపికబురు చెప్పిన మోడీ
  • జ‌గ‌న్ మ‌ళ్లీ వ‌స్తే…ఏం జ‌రుగుతుందో చెప్పిన అయ్య‌న్న‌
  • కొత్త పార్ల‌మెంటు…`శ‌వ‌పేటిక‌`.. దారి త‌ప్పిన ప్ర‌తిప‌క్షం విమర్శ‌లు!
  • వైసీపీ రౌడీలూ.. ఖ‌బ‌డ్దార్‌: వైసీపీకి చంద్ర‌బాబు వార్నింగ్‌
  • పార్ల‌మెంటు ప్రారంభోత్స‌వం వేళ‌.. జ‌గ‌న్‌ కు ఘోర అవ‌మానం.. ఏం జ‌రిగింది?
  • ఏం చేశార‌ని ఓటేయాలి.. వైసీపీపై పెరుగుతున్న అవిశ్వాసం!
  • సంచలన హామీలు – డబ్బుల వర్షం కురిపిస్తున్న చంద్రబాబు
  • తెలుగుదేశం సంచలన హామీ – ఏపీ ప్రతి స్త్రీకి నెలకు 1500
  • ఏం జనంరా బాబూ….
  • అయితే.. ఆ లెక్క‌న వైసీపీ ఖాళీయేనా?

Most Read

సాఫ్ట్ వేర్ : 4 నెల‌లు.. 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు.. ఫ‌ట్‌!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

NRI TDP USA-న్యూయార్క్`టైమ్ స్కేర్‌`లో రోజంతా ‘అన్న‌ ఎన్టీఆర్’ ప్ర‌క‌ట‌న‌!

ఏపీ సీఎం బిగ్ మిస్టేక్.. 10 వేల కోట్ల కోసం..

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra