The all new #ScorpioN has been launched & ET NOW got behind the wheels of the mean machine for a test drive. What are the new features after the facelift? We get you all the the details of pricing, design, variants & new features@SrishtiSharma_ @MahindraRise @anandmahindra pic.twitter.com/FtlaV4oQQM
— ET NOW (@ETNOWlive) June 30, 2022
ఇటీవల కాలంలో మాంచి జోరు మీద ఉన్న మహీంద్రా మహీంద్రా వాహన సంస్థ.. తాజాగా మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారింది. శనివారం ఈ సంస్థకు చెందిన సరికొత్త వాహనం స్కార్పియో-ఎన్ (కొత్త మోడల్) బుకింగ్స్ చేపట్టారు.
ఆన్ లైన్ లో బుకింగ్స్ ను షురూ చేసిన మొదటి నిమిషయంలో ఏకంగా 25 వేల వాహనాల బుకింగ్స్ చేపట్టటం సంచలనంగా మారింది. సరికొత్త డిజైన్ లో చూసినంతనే ఆకట్టుకునేలా ఉండే ఈ వాహనంపై కొద్ది రోజులుగా మార్కెట్లో మాంచి బజ్ ఉంది.
ఈ వాహన బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా? అని ఎదురుచూసిన వారంతా.. భారీగా బుకింగ్స్ కావటాన్ని సంస్థ ప్రతినిధులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. శనివారం ఉదయం సరిగ్గా 11 గంటలకు మొదలైన బుకింగ్స్ కేవలం అరగంటలోనే లక్ష బుకింగ్స్ దాటిపోవటం.. బుకింగ్ చేసుకున్న వారు అడ్వాన్సు రూపంలో డబ్బులు చెల్లించారు. శనివారం నమోదైన బుకింగ్స్ విలువ రూ.18వేల కోట్లుగా ఉంటాయని చెబుతున్నారు.