అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన ఒంగోలు వైసీపీ నాయకుడు.. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన రాజకీయ భవిష్యత్తును ఆవిష్కరించారు. తనపైనా తన కుటుంబంపైనా వస్తున్న వార్తలను.. ఆయన ఖండించారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో తన కుటుంబంపై తీవ్రమైన కథనాలు వస్తున్నాయని.. వాటిని ఇకనైనా కట్టబెట్టాలని.. ఆయన విన్నవించారు. అయితే.. నిప్పు లేందే పొగరాదు అనే సామె త ఇప్పుడు తెరమీదికివ వచ్చింది.
మాగుంట అంత నిజాయితీపరుడు అయితే.. ఆయనకు టీడీపీ నేతలకు మధ్య అవినాభావ సంబంధాలు లేకపోతే.. ఏ మీడియా అయినా.. ఎందుకు రాస్తుంది. ఒక్క మాగుంటతోనే రేటింగ్ పెరుగుతుందని ఎవరైనా అనుకుంటారా? పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు.. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో టీడీపీ ఎంపీలకు విందు ఇచ్చింది నిజం కాదా? ఇటీవల ఒంగోలులో మహానాడు నిర్వహించినప్పుడు.. రూ.15 లక్షల సాయం అందించిన మాట తెరచాటుగా చేసినా.. దాగలేదు కదా!
ఇక, మాగుంట తనయుడు.. ఒంగోలు టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో తిరిగింది వాస్తవంకాదా..? వైసీపీ నేతలను ఇంటికి కూడా రానిచ్చేది లేదని.. అన్నమాట వాస్తవం కాదా? గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నాం.. మాకు సాయం చేయండి అన్న లోకల్ లీడర్లకు ఉత్తచేతులు చూపించింది నిజం కాదా? అసలు.,. పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా.. వేదిక ఎక్కగానే విమర్శలు గుప్పించింది.. వాస్తవం కాదా? అనే ప్రశ్నలకు కూడా మాగుంట సమాధానం చెబితే బాగుండేది.
మరీ ముఖ్యంగా కొన్ని రోజుల కిందట జరిగిన నియోజకవర్గం ప్లీనరీలోనూ.. మాగుంట వైసీపీ సర్కారును కార్నర్ చేశారు. నియోజవకర్గం అభివృద్ధి జరగడం లేదని.. ఎవరూ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తమను నమ్ముకున్నవారికి ఏమీ చేయలేక పోతున్నామని వ్యాఖ్యానించారు. మరి ఇవన్నీ.. దేనికి సంకేతాలు…? తప్పులు మీరు చేసి.. ఇప్పుడు.. మీడియాపై నెట్టేయడం ఎంత వరకు సమంజసం? అనేది మీడియా వర్గాల ప్రశ్న. మరి దీనిపైమాగుంట ఏమంటారోచూడాలి.
ఇక, ఇప్పుడే ఎందుకు మీడియా ముందుకు వచ్చారు? అంటే.. ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నా యి. ఒకటి.. త్వరలోనే వైన్స్‌ను ప్రైవేటుకు ఇచ్చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిలో దాదాపు 100 షాపులను స్వయంగా మాగుంట కుటుంబం ఏర్పాటు చేయనుందని.. రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సయమంలో ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే.. ఈ షాపుల ఏర్పాటు సాధ్యం కాదు.. సో.. అందుకే ఆయన ఇప్పుడు మీడియా మీటింగ్ పెట్టి జగన్ స్త్రోత్ర పాఠాలు అందుకున్నారని పరిశీలకులు చెబుతున్నారు.
ఇక, ఢిల్లీలో వెలుగు చూసిన.. మద్యం కుంభకోణంలో మాగుంట కంపెనీల పాత్ర ఉందని.. సాక్షాత్తూ కేంద్ర మంత్రి మీడియా ముందు చెప్పారు. దీనిపై విచారణ కూడా జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ వివాదం నుంచి బయట పడాలంటే.. సీఎం జగన్ జోక్యం అవసరం.. అందుకే ఇప్పుడు తప్పులు తను చేసి.. మీడియాపై రుద్దే ప్రయత్నాలు చేయడం.. సమంజసమేనా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.