‘మద్యపాన నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడుంది’ ఇది తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) చేసిన ప్రకటన. మద్యం షాపులను తొందరలోనే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందనే కథనాలు, వార్తలు అబద్ధమని చెప్పింది. ఇందులో భాగంగానే మద్యపాన నిషేధం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించింది. ఇక్కడే కార్పొరేషన్ చెబుతున్నది అబద్ధమని అర్ధమైపోతోంది.
కార్పొరేషన్ లెక్కప్రకారం ప్రభుత్వం పూర్తిగా సంక్షేమానికి కట్టుబడుందట. ఇందుకనే మద్యం దుకాణాలను 4380 నుండి 2394 కు తగ్గించినట్లు చెప్పింది. మద్యపాన నియంత్రణ కు అవసరమైన చర్యలను వేగంగా అమలు చేస్తోందట.
గత మూడేళ్ళల్లో ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నట్లు చెప్పుకోవటమే విచిత్రంగా ఉంది. ఏ ప్రభుత్వానికి అయినా మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకోవటం ఇష్టం ఉండదన్నది వాస్తవం. నిజానికి మద్య నిషేధం సాధ్యం కాదు కూడా.
చుట్టుపక్కల రాష్ట్రాల్లో మద్యంపై నిషేధం లేనపుడు మధ్యలో ఉన్న రాష్ట్రంలో మాత్రం నిషేధం ఎలా సాధ్యమవుతుంది ? ఏపీకి చుట్టూ ఉన్న తమిళనాడు, తెలంగాణా, కర్ణాటక, ఒడిస్సా, పాండిచ్చేరిలో కూడా మద్య నిషేధం అమలైతే అప్పుడు ఇక్కడ కూడా నిషేధాన్ని అమలు చేయవచ్చు.
ఈ విషయాలు తెలిసి కూడా మహిళల ఓట్లు వస్తే చాలని మొన్నటి ఎన్నికల్లో జగన్ దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తానని ప్రకటించారు. ఇదే సందర్భంగా మద్యాన్ని కొనాలంటే మామూలు జనాలకు షాక్ కొట్టేవిధంగా ధరలను పెంచేస్తానని కూడా చెప్పారు. స్టార్ హోటళ్ళల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉండేట్లుగా చర్యలు తీసుకుంటానన్నారు.
అధికారంలోకి వచ్చిన రేట్లు పెంచి సొంత బ్రాండ్లు అమ్మి తన వాళ్లను సంపన్నులను చేశాడు. పేదలకు మాత్రం చీప్ క్వాలిటీ మందు అధిక ధరలు పెట్టి కొనేలా చేశాడు. షాపులను గవర్నమెంట్ కింద నడుపుతాం అని చెప్పి ఓన్లీ క్యాష్ అనే బోర్డులతో ఏదో మాయ చేశారు. తన అసమర్థతో పెట్టుబడులు తేలేక రాష్ట్రం ఆదాయం పెంచలేక ఇక మద్యాన్ని కొనసాగించాడు. ఇదే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించేస్తే సమస్యే ఉండకపోను. ఒకవైపు మద్యాన్ని కంటిన్యు చేస్తునే మరోవైపు మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పటంతోనే సమస్య వస్తోంది.