ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా జనాలపై ఎంతగా ప్రభావం చూపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాలను కూడా ఎంతగానో ప్రభావం చూపుతున్న ఈ మీడియా మీద పార్టీలు ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి. కేంద్రంలో రెండుసార్లు మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిందంటే అందులో సోషల్ మీడియా పాత్ర కీలకం. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ కూడా గుర్తించి సోషల్ మీడియాను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లుంది. అతను ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఉండే యువతను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఇటీవలే రాహుల్ సిక్స్ ప్యాక్ బాడీతో స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఒక ఫొటో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. దాన్ని ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ వర్గాలు సోషల్ మీడియాలోకి తెచ్చినట్లున్నాయి. రాహుల్‌ను యూత్ ఐకాన్‌గా మార్చడంలో ఇదొక ఎత్తుగడగా భావించవచ్చు.ఇప్పుడు రాహుల్ తన ఫిట్నెస్ను చాటుకునే ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది ఒక బహిరంగ సభకు సంబంధించిన వీడియో కావడం విశేషం. తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ తరచుగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడులోని ఒక పాఠశాలలో విద్యార్థులతో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా అతను ఫిజికల్ ఫిట్నెస్ ప్రాధాన్యం గురించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే ఆ పాఠశాలలో క్రీడల్లో మంచి నైపుణ్యం ఉన్న అమ్మాయిగా పేరున్న మెరోలిన్ అనే అమ్మాయితో పుషప్ ఛాలెంజ్‌కు సిద్ధమయ్యాడు రాహుల్. ఇద్దరు ఎదురెదురుగా పుషప్స్ తీయడం మొదలుపెట్టారు. మెరోలిన్ కొన్ని పుషప్స్ తర్వాత వేగం తగ్గించేసింది. కానీ రాహుల్ మాత్రం శరవేగంగా పుషప్స్ తీసి తన ఫిట్నెస్ ఎలాంటిదో చూపించాడు. అంతే కాదు.. ఒక చేత్తోనూ పుషప్ తీయడంతో ఆ సభా ప్రాంగణం మార్మోగిపోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.