ఔను.. ఆ మూడు.. చోట్ల ప్రజలు ఇచ్చే తీర్పు.. వైసీపీ అధినేత.. సీఎం జగన్ ఆలోచనలను మార్చేనా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మునిసిపాలిటీలు.. కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు వచ్చా యి. ఇవి.. పార్టీల గుర్తులపై జరిగేవే. దీంతో అన్ని పార్టీల నేతలు ప్రస్తుతం ప్రచార జోరు పెంచారు. దీంతో వీటికి ప్రాధాన్యం సంతరించుకుంది. మరీ ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ ఆలోచనలకు ప్రజలు పచ్చ జెండా ఊపుతారా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో 14 చోట్ల కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి.
వీటిలో ఎక్కడ పరిస్థితి ఎలా ఉన్నా.. తమకు అనుకూలంగా ఉన్న లేకున్నా.. కీలకమైన మూడు కార్పొరేషన్లలో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలని .. వైసీపీ టార్గెట్ పెట్టుకుంది. దీనికి ప్రధాన కారణం.. ఆయా కార్పొరేషన్లలో తాము విన్నయితే.. ఇప్పటి వరకు తాము తీసుకున్న కీలక నిర్ణయాలకు ప్రజలు ఆమోద ముద్ర వేసినట్టేనని.. ప్రతిపక్షాలు ఈ విషయాల్లోవిఫలమయ్యాయని ప్రచారం చేసుకునేందుకు వైసీపీకి అవకాశం వచ్చినట్టు అవుతుంది. అదేసమయంలో రాష్ట్ర భవిష్యత్తును కూడా ఈ మూడు ప్రాంతాల్లోని ఎన్నికలు మలుపు తిప్పనున్నాయి.
రాష్ట్రంలో జరుగుతున్న 14 కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ, విశాఖ, గుంటూరు కార్పొరేషన్లు కీలకంగా మారాయి. గుంటూరులో రాజధాని అమరావతిని కేవలం శాసన రాజధానిగా ఉంచి.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్లో కనుక వైసీపీ గెలిస్తే.. అధికార పార్టీ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలు జై కొట్టారనే సంకేతాలు వస్తాయి. ఇది విపక్షాలకు ఫుల్లు మైనస్తోపాటు.. కీలక నిర్ణయానికి ప్రజలు ఆమోదం తెలిపినట్టుగానే భావించాలి.
అదేవిధంగా విజయవాడ కార్పొరేషన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీ కనుక ఇక్కడ పాగా వేస్తే.. మూడుకు ప్రజలు జై కొట్టినట్టే. ఇక, ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీ కరించేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఈ విషయంలో జగన్ ప్రభుత్వం కూడా తెరచాటున ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు విశాఖ కార్పొరేషన్లో కనుక వైసీపీ గెలిస్తే.. విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ జరగడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ మూడు చోట్లా వైసీపీ గెలిస్తే.. జగన్ మూడ్‌కు జనం ఓకే చెప్పినట్టే.. ఇదే ఇప్పుడు ప్రచారంలో ఉంది. రాజధాని అమరావతిగా ఉండాలని కోరుకున్నా.. విశాఖ ఉక్కు ఇక్కడే ఉండాలని భావించినా.. ఈ మూడు ప్రాంతాల ప్రజలు.. ఆచితూచి వ్యవహరించాలనేది ప్రతిపక్షాల టాక్ మరి ప్రజలు ఎలా నిర్ణయిస్తారో చూడాలి.