
5 రోజులుగా ఒక ఉత్కంఠ
ఏపీ ప్రతిపక్ష నేత, సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గెలిచిన నియోజకవర్గంలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలిచిందంటూ ప్రచారం జరిగింది.
టెక్నికల్ గా ఇది నిజమే. కానీ సామదానబేధ దండోపాయాలు వాడి, బెదిరించి, డబ్బు కుమ్మరించి గెలిచారన్నది టీడీపీ ఆరోపణ. పెద్దిరెడ్డి 100 కోట్లు ఖర్చుపెట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు పని అయిపోయిందని డబ్బా కొట్టడానికి మానిప్యులేట్ చేశారన్నది టీడీపీ చెబుతోంది.
అయితే, ఏది నిజమో అన్న అనుమానం జనాలకు నేటి వరకు ఉంది. కానీ అది నేడు తీరిపోయింది. 5 రోజుల క్రితం చంద్రబాబు కుప్పం పర్యటన షెడ్యూలు పెట్టినప్పటి నుంచి ఉత్కంఠగా ఎదురుచూస్తోంది మీడియా.
అయితే, ఆ 5 రోజులు గడిచిపోయింది. ఈరోజు చంద్రబాబు కుప్పంలో పర్యటించగా ఇసుకేస్తే రాలనంత జనం హాజరయ్యారు. దీంతో వైసీపీ పంచాయతీలో తెచ్చిన ఫలితాలు వాస్తవాలు కాదు అని చంద్రబాబు పర్యటన ద్వారా నిరూపితం అయ్యిందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
దౌర్జన్యాలు, అక్రమాలు చేసి దొడ్డిదారిన తెచ్చుకున్న గెలుపుతో ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలకు కళ్ళు బైర్లు కమ్మేలా… కుప్పం పర్యటనలో @ncbn ఎక్కడికి వెళ్తే అక్కడికి జనసంద్రం కదలి వచ్చింది. కుప్పం పట్టణంలో చంద్రబాబు ప్రసంగాన్ని వినడానికి తరలివచ్చిన భారీ జన సందోహం ఇది.#CBNinKuppam pic.twitter.com/5TvsRUCJNz
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) February 25, 2021