జనాలు టిడిపి సభలకు వెళ్ళారు .. కుర్చీలు వైసీపీ సభలకు వెళ్ళాయి ????
సమన్యాయం అంటే ఇదేనేమో.. pic.twitter.com/mbRjtWX1pg— Telugu Desam Party (@JaiTDP) May 29, 2022
కర్నూలులో మంత్రులు చేపట్టిన బస్సు యాత్రకు ప్రజా స్పందన కరవైంది. డ్వాక్రా మహిళలను ఉదయమే వేదిక వద్దకు తరలిం చినా.. సభా ప్రాంగణంలో ఎలాంటి సదుపాయాలూ లేకపోవటంతో అక్కడి నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. కర్నూలులో మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర సభకు స్పందన కరువైంది. సి.క్యాంపు కూడలిలో ఏర్పాటు చేసిన సభకు.. డ్వాక్రా మహిళలను ఉదయం 10 గంటలకు వేదిక వద్దకు తరలించారు.
ఎండ తీవ్రంగా ఉండటంతోపాటు సభా ప్రాంగణంలో షామియానాలు లేకపోవటంతో.. వేడికి తాళలేక మహిళలంతా ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. సభ నుంచి వెళ్లకుండా మహిళలను అధికారులు నిలువరించినా.. “ఎండ ఎక్కువగా ఉంది.. మీరే ఉండండి” అంటూ.. వెళ్లిపోయారు. మంత్రులు ఒంటి గంటకు రావటంతో సభలో జనాలు లేక కూర్చీలు అన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.
మంత్రుల వాహనాలు ఢీ
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు వద్ద వైసీపీ నాయకుల కార్లను.. ఆ మార్గంలో ప్రయాణించిన వాహనాలు ఢీకొన్నాయి. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా వెళుతున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కారు అకస్మాత్తుగా ఆగింది. ఈ క్రమంలో వెనుకనుంచి కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే కార్లలో ఉన్న నాయకులెవరికీ ఇబ్బంది కలగలేదు. ఈ ప్రమాదానికి కారణం మీరంటే మీరంటూ నాయకుల అనుచరులు, సాధారణ వాహన ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.
అనంతపురంలో ముందస్తు అరెస్టులు
అనంతపురం జిల్లాలో మంత్రుల సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర సందర్భంగా వివిధ వర్గాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. తెలుగుదేశం, ఎంఆర్పీఎస్, ఇతర ఎస్సీ సంఘాల నాయకులను అరెస్టు చేసి శింగనమల, బుక్కరాయసముద్రం స్టేషన్లకు తరలించారు. బలహీనవర్గాలకు అన్యాయం చేసిన వైసీపీ… బస్సు యాత్ర పేరిట మోసం చేస్తోందని తెలుగుదేశం సహా ఇతర సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మనుషులకు సంకెళ్లు వేసినా, మనసులకు వేయలేమనే విషయాన్ని గుర్తించాలని ఆయా సంఘాల నాయకులు అన్నారు.
ఢిల్లీ కి పోయి అప్పులు అడుక్కోవటం….
మీఁటింగ్ ల్లో చప్పట్లు అడుక్కోవటం….
ఎక్కడున్నా అడుక్కోవటం కామన్…
ఏంటి బుగ్గన ఇది…. pic.twitter.com/nR3jyx4hwH— CM NAIDU (@CM_NAIDU_G) May 29, 2022