ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడు సభ విజయవంతమైన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో ఘనమైన ఏర్పాట్లు చేశారు.
జగన్ కూడా ఊహించనంత మంది, చంద్రబాబు కూడా అంచనా వేయలేనంత మంది సభకు హాజరయ్యారు.
ఒంగోలు పసుపుమయమైంది. బస్సులు ఇవ్వకున్నా, ట్రావెల్స్ వాళ్లను బెదిరించిన ఇంత మంది ఎలా వచ్చారంటూ జగన్ ఇంటెలిజెన్స్ పై, పోలీసు అధికారులపై సీరియస్ అయ్యారట.
వైసీపీ పాలనకు శుభం కార్డు వేయడానికా అన్నట్టు మహానాడుతో ఏపీ ప్రజలు నాంది పలికినట్టు స్పందన ఉంది.
ఇది చూసి వైసీపీలో గుబులు రేగింది. వైసీపీ సభలకు ఖాళీ కుర్చీలు ఒకవైపు దర్శనమిస్తుండటం, ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ బెడిసికొట్టడం, ఎక్కడికెళ్లినా నిలదీస్తున్న పరిస్థితులు ఎదురుకావడం వైసీపీ అధినేత జగన్ ను ఆందోళనకు గురిచేస్తోంది.
దీంతో అసలేం జరుగుతోంది అనీ టీడీపీకి జనంలో ఉన్న ఆదరణను అంచనా వేసేందుకు వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది.
సొంత బస్సు యాత్రలపై ఫోకస్ తగ్గించి మహానాడు సభపై వైసీపీ అదిష్టానం దృష్టి పెట్టింది.
మహానాడుకు ఎంతమంది వచ్చారన్న విషయం పూర్తిగా నివేదిక అడిగాడట.
మహానాడు బాగా సక్సెస్ అయిందని, 4 లక్షల మంది హాజరయ్యారని రిపోర్టులో తేలిందట.
ఒక్క మహానాడు ప్రాంగణంలోనే రెండు లక్షల 50 వేల మంది ఉన్నట్లు ఇంటెలిజెన్స్ చెప్పిందట.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి ఏ బెదిరింపులకు భయపడకుండా జనం తరలివచ్చారట.
మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కావడం జగన్ ను మరింత కలవరానికి గురిచేసిందట.
2023/24 ఎన్నికల యుద్ధానికి సై#Mahanadu2022 pic.twitter.com/0izt7AW8Zm
— Telugu Desam Party (@JaiTDP) May 29, 2022
వ్యవసాయం చేసే
అడుసు పాదాలు
చల్లటి మజ్జిగ
పంచేప్పుడు పట్టించుకోలేదు. #Mahanadu2022 pic.twitter.com/abigy7F78z— Telugu Desam Party (@JaiTDP) May 29, 2022