ఆంధ్రుల ఆరాధ్య నట సార్వభౌముడు తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారి 99వ జయంతి మరియు తెలుగుదేశం పార్టీ 40వ జయంతి సందర్భంగా న్యూజిలాండ్ తెలుగు దేశం పార్టీ మహానాడు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రవీణ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు అనేక సంక్షేమ పథకాలతో పేద బడుగు బలహీన వర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు.
కృష్ణ చేబ్రోలు మాట్లాడుతూ దుర్మార్గపు,ఫ్యాక్షనిస్ట్, సైకో పాలనలో రాష్ట్రము సర్వనాశనం ఇయింది అని,దాన్ని సరి చేయడం ఒక్క చెంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం కాబట్టి ఆంధ్రులు 2019 లో చేసిన తప్పును సరిదిద్దుకోవాలని మళ్ళి తెలుగు దేశం పార్టీని అధికారంలో తేవాలని తెలుగు ప్రజలందరికి విజ్ఞప్తి చేసారు.
షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజలే దేవుళ్ళు సమాజం దేవాలయం అని నిజమైన సమసమాజం కోసం కృషి చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
తరువాత కృష్ణమనేని శ్రీనివాస్ ప్రసంగిస్తూ ఎన్టీఆర్ ఆశయాలను గుర్తుకు చేసుకోవడంమాత్రమే కాదు అయన ఆశయాలు పాటిస్తూ పేదలందారికి కుడు గుడ్డ ఇల్లు అందేలాగా చూడాలని చెప్పారు.ఎన్టీఆర్ గారు బ్రతికినంతకాలం ఆత్మాభిమానంతో బ్రతికారని అయన వల్లే తెలుగుజాతికి ఇంత గుర్తింపు వచ్చింది.చంద్రబాబుగారి విధానాలతో ఆంధ్రుల ఆత్మవిశ్వాసం పెరిగి తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో విస్తరించింది అని వివరించారు.
సుధీర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సంక్షేమ పధకాల వల్ల అభివృద్ధి చెందిన కుటుంబాల్లో మాది ఒకటని,నా ప్రాణం ఉన్నంత వరకు ఎన్టీఆర్ ను గుండెల్లో పెట్టుకొని ఆరాదిస్తానని అలాగే తెలుగు దేశం పార్టీ కోసం ఎలాంటి సేవచేయడానికైనా సిద్ధంగా వున్నానని చెప్పారు.
చివరగా సుబ్బారావు నడింపల్లి మాట్లాడుతూ గత సంవత్సరంలో న్యూజిలాండ్ తెలుగుదేశం చేసిన కార్యక్రమాలను మరియు భవిషత్తు ప్రణాళికలను వివరించారు.
తరువాత తెలుగు సాంప్రదాయ పద్దతులతో అతిధులకు భోజనాలు వడ్డించారు.