ఏపీలో నెలకొన్న పరిస్థితులు.. మారుతున్న రాజకీయ వాతావరణం.. వంటివి ఎప్పటికప్పుడు చర్చకు వస్తున్న విషయం తెలి సిందే. ముఖ్యంగా ఇటీవల కాలంలో సీఎం జగన్‌పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతుండడం.. అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబా బుకు అనుకూలంగా పరిస్థితులు మారుతున్న వైనం కూడా ఆసక్తిగా మారుతోంది.
ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రంలో జరుగుతు న్న రాజకీయ పరిణామాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఏపీలో ఎవరి పొజిషన్ ఎలా ఉంది? ఎవరు వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుంటారు? అనే అంశాలపై కేసీఆర్ రహస్యంగా సర్వే చేయించారని.. పొలి టికల్ సర్కిళ్లలో చర్చ సాగుతోంది.
ఇక, కేసీఆర్ చేయించిన సర్వేలో.. ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఎక్కడా అభివృద్ధి లేకపోవడంతోపాటు.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. నిరుద్యోగులు జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనీసం తమకు నెలకు జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహంతో ఉన్నారు.
ఇక, రోడ్లు ఎక్కడిక్కడ గోతులు పడినా.. అవి కూడా సరిచేయడం లేదు. అదేసమయంలో ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయి.. మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక కల్లోల భరిత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే జగన్‌కు వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పుతున్నారు.
ఈ విషయాలన్నీ.. కూడా కేసీఆర్ చేయించిన సర్వేలో స్పష్టం కావడం గమనార్హం. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో చేయించిన ఈ సర్వే ప్రకారం సీఎం జగన్ పట్ల యూత్, ఉద్యోగ వర్గం పూర్తిగా వ్యతిరేకతతో ఉంది మరీ ముఖ్యంగా రాజధాని లేకపోవడం.. ఉన్న అమరావతిని కూడా అభివృద్ధి చేయకపోవడం.. పారిశ్రామిక వర్గానికి ఎక్కడా సానుకూల వాతవరణం లేకపోవడం వంటివి మైనస్‌గా మారుతున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు కూడా.. చంద్రబాబు వైపు మళ్లుతున్నారు.. అనే సర్వే తేలింది.
దీంతో ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే.. జగన్ నేతృత్వంలోని వైసీపీకి కేవలం 48 సీట్లు మాత్రమే దక్కుతాయని.. కేసీఆర్‌కు తెలిసింది. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి 90 -98 సీట్లు జనసేన 10 సీట్లు దక్కించుకుంటుం దని.. కేసీఆర్ సర్వేలో స్పష్టమైంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ఏపీలో పుంజుకుంటున్న పరిణామాలు స్పష్టం అయినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఏపీ ప్రభావం ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్న కేసీఆర్.. తాను కూడా.. ఆ మేరకు జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీసీ సానుకూల శక్తులను తన వైపు తిప్పుకొనేందుకు ఎన్టీఆర్ శత జయంతిని ఒక అస్త్రంగా మార్చుకున్నారనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం.