రైతులకు ఏమీ చేయని వాడు
రైతుల పేరు చెప్పి డబ్బులు దొబ్బేసిన వాడు
కాలరెగరేసి మేము రైతు పక్షపాతులం అని చెప్పుకుని రైతులను నమ్మించారు.
కానీ రైతుల జీవన గతిని మార్చే నిర్ణయాలు తీసుకున్న తెలుగుదేశం పార్టీ మాత్రం తాము రైతులకు ఏం చేశామో చెప్పుకోవడంలో తీవ్రంగా విఫలమైంది.
రైతులకు తొలుత ఎన్టీఆర్ హయాంలో కరెంటు భారం తగ్గించారు.
తర్వాత ఎన్టీఆర్ హయాంలో రెవెన్యూ మోడల్ ను మార్చారు.
తర్వాత చంద్రబాబు రెవెన్యూ వ్యవస్థను ప్రజల వద్దకు పాలన అంటూ రైతులకు తెచ్చారు.
అసలు రైతు పంటను ఎవడో అమ్ముకోవడం ఏంటి? అని రైతు బజార్లు అనే కొత్త కాన్సెప్టును ప్రవేవపెట్టాడు చంద్రబాబు.
వీటన్నింటికంటే కీలకమైన రాయలసీమ గతిని మార్చిన ప్రయోగం ‘డ్రిప్ సబ్సిడీ‘ చంద్రబాబు తీసుకున్నదే.
డ్రిప్ వల్ల కరెంటు, నీరు, డబ్బు మూడు ఆదా అని తెలుసుని వన్ టైం పెట్టుబడి లేక రైతులు పొలాలను ఎండెబట్టేవారు. ముఖ్యంగా రాయలసీమలో భూగర్భ జలాలపై ఆధారపడే రైతులు ఇలా చేసేవారు. 1999లో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకుని 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పెట్టుకోమని ఇచ్చాడు. చంద్రబాబు ఆరోజు తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోనే అత్యధికంగా కూరగాయలు, పళ్లు పండించే జిల్లాగా అనంతపురం అవతరించింది.
ఇది ఏనాడైనా చంద్రబాబు గాని, టీడీపీ నేతలు గా చెప్పుకోగలిగారా? అసలు ఈ విషయం వారికి తెలుసా అన్న అనుమానం ఉంది. నిజానికి అనంతపురంలో ఏ రైతును ఆరా తీసినా ఈ విషయం తెలుస్తుంది.
రాయలసీమ రైతులన షావుకార్లను చేసిన నిర్ణయం ఇది.
తమాషా ఏంటంటే… రైతును ప్రేమించేది మేమే అని చెప్పకుని తిరిగే వైఎస్ జగన్ … ఈ పథకాన్ని ఎత్తేసిన విషయం ఎంత మందికి తెలుసు?
తెలియదు. ఎందుకంటే టీడీపీకి ప్రచారం చేసుకోవడం రాదు. చరిత్రను తిరగరాసే నిర్ణయాలను కూడా ప్రచారం చేసుకోలేని తెలుగుదేశం ఎలా క్రిమినల్ మైండ్ తో పనిచేసే ప్రత్యర్తులను తట్టుకోగలదు.
ఇక్కడ ఇంకో ప్రశ్న వేయాలి.
అసలు 2014-2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాల పేర్లన్నీ ఎవరైన టకటకా చెప్పగలరా? పోనీ టీడీపీ వాళ్లయినా చెప్పగలరా? అనుమానమే. ఒకసారి అవేంటో చూద్దామా?
చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఇచ్చిన సబ్సిడీ పథకాలు
1 రైతు రుణమాఫీ
2 ఇన్పుట్ సబ్సిడీ
3 క్రాప్ ఇన్సూరెన్స్
4 విత్తన సబ్సిడీ
5 డ్రిప్ సబ్సిడీ
6 స్పింక్లర్లు సబ్సిడీ
7 ట్రాక్టర్ల సబ్సిడీ
8 ట్రిల్లర్లు గొర్రులు గుంటకలు రోటోవేటర్ల సబ్సిడీ
9 తైవాన్ స్ప్రేయర్ల సబ్సిడీ
10 మొక్కలు సబ్సిడీ
11 మల్చింగ్ షీట్లు సబ్సిడీ
12 రబ్బరు క్రేట్లు సబ్సిడీ
13 ప్యాకింగ్ హౌస్ లు సబ్సిడీ
14 మైక్రో న్యూట్రిషన్స్ సబ్సిడీ
15 ద్రాక్ష పందిర్లు సబ్సిడీ
16 టార్పాలిన్లు