టాలీవుడ్ లో తనదైన టాలెంట్, గ్లామర్ షోతో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ వరుస ఆఫర్లను పట్టేస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే మరోవైపు బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడిపిస్తోంది. గత ఏడాది తన బర్త్డే సందర్భంగా ప్రియుడిని పరిచయం చేసిన రకుల్.. వీలు చిక్కినప్పుడల్లా జాకీతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుంది.
బాలీవుడ్ లో జరిగే పార్టీలకు వీరిద్దరూ కలిసే హాజరవుతున్నారు. తరచూ విహార యాత్రలకు వెళ్తున్నారు. అయితే పెళ్లి మాత్రం ఇప్పట్లో చేసుకోనని రకుల్ ఇప్పటికే కుండ బద్దలు కొట్టేసింది. మా ఇద్దరి దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రకుల్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. గత సండే జాకీతో కలిసి రకుల్ డేట్ కి వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసింది. సండేను మరింత స్పెషల్ గా మార్చుకుంది.
అయితే ఈ క్రమంలోనే తాను పెట్టుకున్న రూల్స్ ను సైతం బ్రేక్ చేసేసింది. వాస్తవానికి రకుల్ మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. తన జీరో సైజ్ అందాలతో మిస్మరైజ్ చేసే రకుల్.. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ రెగ్యులర్ గా జిమ్ లో కసరత్తులు చేస్తుంది. ఫుడ్ ను కూడా లెక్కలేసుకుని మరీ తినే రకుల్.. తాజాగా తానూ పెట్టుకున్న రూల్స్ ను బద్దలు కొట్టి ప్రియుడితో కలిసి హ్యాపీగా ఐస్ క్రీమ్ ను లాగించేసింది.
అంతే కాకు, ఇందుకు సంబంధించిన పిక్ ను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ.. `ఇది మోసం కాదు ట్రీట్.. ఎప్పుడో ఒకప్పుడు చేయడం తప్పేమీ కాదని మన మనసుకు శిక్షణ ఇవ్వాలి.. లోపల ఉన్న సంతోషకరమైన హార్మోన్స్ బయటకు రానివ్వాలి` అని రాసుకొచ్చింది. దీంతో ఆమె పోస్ట్ కు ప్రియుడు జాకీ `వావ్ వాటే లవ్లీ పిక్చర్` అని కామెంట్ చేయగా.. అందుకు రకుల్ `థ్యాంక్స్ ఫోటో గ్రాఫర్` అని రిప్లై ఇచ్చింది. ఈమె రిప్లైతో రకుల్ ఐస్ క్రీమ్ తింటున్న పిక్ ను తీసింది జాకీనే అని స్పష్టంగా అర్థమైంది.
కాగా, రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `ఎటాక్`, `రన్ వే 34` చిత్రాలతో ఈ బ్యూటీ ప్రేక్షకులను పలకరించింది. కానీ, ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రస్తుతం `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్`, `ఛత్రీవాలీ`, `మిషన్ సిండ్రెల్లా` సినిమాలు చేస్తోంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం రకుల్ చేతిలో ఉన్నాయి.