త్యాగం ఎలా అయినా ఉండనీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడం ఓ విపక్ష పార్టీ అనుకుంటున్న పని.. ఓట్లన్నీ మాకే సీట్లన్నీ మావే అని వైసీపీ అనుకోవడం తప్పు కాదు.. కానీ వ్యతిరేకతలు కూడా ఉన్నాయి అని గుర్తించకపోవడమే మహా పాపం. కనుక కూటమి రాజకీయాలే చెడ్డవి అయితే ఆ రోజు కాంగ్రెస్ లో కూడా వైఎస్సార్ కూటమి రాజకీయాలే నడిపారు.
ఆ మాటకు వస్తే ఇప్పుడు బీజేపీ కూడా కూటమి రాజకీయాలతో ఎంతో కాలం రాజకీయం నడిపింది. అదేం తప్పూ కాదు పాపం అంత కన్నా కాదు. కానీ తమకు ఎవ్వరి దగ్గర తలవొంచాల్సిన పని లేదు అని సజ్జల లాంటి వారు చెప్పుకోవడం వారి స్థాయిని తగ్గించుకోవడమే..మిగతా నాయకుల మాదిరి ఆయన ఎందుకు స్థాయి తగ్గించుకుని లేని బాధనో నొప్పినో ఒంటి మీద వేసుకుంటున్నారని?
అసలు పొత్తులపై వైసీపీ ఎందుకనో ఓ అస్థిర రాజకీయం నడుపుతోంది. నొప్పి ఉందో లేదో కానీ పైకి మాత్రం ఏవేవో చెబుతుంది. నొప్పి ఉంటే మాత్రం అందుకు కారణం ఓటమి భయం కావొచ్చు. నొప్పి ఉంటే మాత్రం అందుకు కారణం జనంలో వ్యతిరేకత ఉంది అని స్పష్టం కావడం. ఈ విధంగా ఎలా చూసుకున్నా పొత్తు ఓ భయంకరమైన వ్యాధి అన్న విధంగా వైసీపీ చూడడం, సింహం సింగిల్ గా రావడం అన్న డైలాగులు వినిపించడం అన్నవి నిజంగానే భారీ స్థాయిలో అంచనాలు పెంచుకుని వైసీపీ మాట్లాడుతోంది.
ఏదేమయినప్పటికీ పొత్తుల విషయం పాపం పుణ్యం అన్నవి పార్టీల కొట్లాటలతోనే తేలాల్సి ఉంది అని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఏనాటి నుంచో జగన్ కు వ్యతిరేకంగా పవన్ తనదైన రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు చెప్పిన త్యాగం వేరు.. సజ్జల చెబుతున్న త్యాగం వేరు. పవన్ ను ఉన్నట్టుండి ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఏమౌతారు? ఒకవేళ చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తే సజ్జలకు అందుకు అంగీకారం ఏమయినా ఉండదా అప్పుడు ? పొత్తులన్నవి పార్టీల అంతర్గత విషయాలు. వాటిలో ఇంకో పార్టీ జోక్యమెలా ఉంటుందో సజ్జలకే తెలియాలి.
ఇప్పుడు టీడీపీ, జనసేన కలిస్తే 2014 నాటి ఫలితాలు తిరిగి వస్తాయని భయం అయి ఉంటుంది వైసీపీకి అని కూడా అంటున్నారు ఇంకొందరు. మరి! పవన్ మాత్రం ఏదో ఒక అద్భుతం జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే వైసీపీ సింగిల్ గా వచ్చి అన్ని సీట్లూ కొట్టేస్తే, పాపం అప్పుడు అంబటి లాంటి లీడర్ల జోస్యం ఫలించేస్తే ఇకపై జనసేనను మాట్లాడనివ్వరేమో అని ఆ పార్టీ అభిమానులు అంటున్నారు. పవన్ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఇవాళ ఒకే స్టాండ్ తో పనిచేస్తున్నారు. ఆ మాటకు వస్తే బీజేపీ నాయకులే ఇంకా ఏ విషయం తేల్చడం లేదు. అధినాయకత్వం తేల్చుకుండానే సోము వీర్రాజు ఏవేవో మాట్లాడుతున్నారు. మరి! ఈ లెక్కలు ఇప్పట్లో తేలుతాయా?