కాపాడాల్సినవేవీ కాపాడరు. దాచుకోవాల్సినవేవీ దాచుకోరు. కార్పొరేట్ దిగ్గజాలను మాత్రం వీలున్నంత వరకూ మచ్చిక చేసుకుంటూనే ఉంటారు. ఆ విధంగా తాము అనుకున్నవి సాధించుకుంటారు. ఇప్పటికే భావనపాడు పోర్టు వర్కు పొంది మంచి లాభాలు చూసిన అదానీకి, మరో వరం గంగవరం పోర్టు.. ఇది కూడా బాగానే లాభాలు తెచ్చిపెట్టింది.
అందుకే అదే ఉత్సాహంతో ప్రభుత్వ వాటాను సైతం లాగేసుకున్న అదానీకి మరో వరం దక్కనుంది. ఈ సారి ఏకంగా టాటాలకే పోటీగా నిలిచి, వేల కోట్ల ఆస్తులను ఒకే సారి సొంతం చేసుకోనున్నారు. అంటే విశాఖ ఉక్కు అదానీ హక్కు అయిపోనుంది. ఇందుకు సంబంధించి సంప్రతింపులు జరుగుతున్నాయి అని తెలుస్తోంది. ఇంకేం ఇక విశాఖ లో అదానీ గ్రూపులకు తిరుగు అన్నదే లేదు.
టాటాల నేతృత్వంలోకి ఎయిర్ ఇండియా వెళ్లింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. నష్టాల పేరిట ఆ సంస్థను తాము భరించలేమని కేంద్రమే చేతులెత్తేస్తే, టాటా ముందుకు వచ్చి ఒకనాటి తమ సంస్థను తిరిగి దక్కించుకుని పరువు నిలబెట్టింది. ఆ విధంగా టాటా కు జేజేలు చెప్పాలి. అలానే ఎయిర్ హోస్టర్ల కట్టూ బొట్టూ భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలని కూడా కోరింది సంబంధిత యాజమాన్యం.
ఓ విధంగా నష్టాల్లో ఉన్న సంస్థలను ఎవరో ఒకరు ఈ విధంగా సొంతం చేసుకోవడం మంచిదే ! మరి! విశాఖ స్టీల్ ను మాత్రం టాటాలు ఎందుకనో వద్దనుకుంటున్నారు. టాటా ల ప్లేస్ లో కార్పొరేట్ దిగ్గజం అదానీ వస్తున్నారు. ఈయనకూ, వైసీపీ లీడర్ సాయిరెడ్డికి ఉన్న అనుబంధాల రీత్యానే ఈ విధంగా చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. త్వరలో ఈయన భార్య ప్రీతి అదానీ కి రాజ్య సభ టికెట్ కూడా దక్కనుంది. అంటే ఇక వారిద్దరి స్నేహానికి తిరుగే లేదు అని తేలిపోయింది అని టీడీపీ అంటోంది.
గంగవరం పోర్టులో అదానీ బాదుడు ప్రారంభం
ఒప్పందాన్ని కాదని స్టీల్‌ప్లాంటుపై బ్లాక్ మెయిలింగ్
టన్నుకు 120 అదనంగా చెల్లించాలని డిమాండ్
సరుకు ప్లాంటుకు పంపకుండా సొంత గోడౌన్‌కు
ప్రభుత్వాల అండతోనే బరితెగింపు
‘విశాఖ ఉక్కు’పై ఏడాదికి 21.6 కోట్ల భారం pic.twitter.com/RosdERmZ8V— sonykongara(O positive Blood group) (@andhrudu12) September 2, 2021