కమర్షియల్ హంగులతో పాటు సామాజిక బాధ్యత ఉన్న సినిమాలకు కేరాఫ్ డైరెక్టర్ కొరటాల శివ. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలను తెరకెక్కించి తన మార్క్ ను చూపించారు. ఆ సినిమాలన్నీ మంచి హిట్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫిస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టాయి.. అలాంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందించిన ఆయన మార్క్ నిన్న విడుదల అయిన ఆచార్య లో ఎక్కడా కనిపించలేదు. ఒక మెగా హీరోతోనే ప్రభంజనాన్ని సృష్టించే రేంజ్ లో సినిమాలను తీస్తున్నారు దర్శకులు.. అలాంటిది ఇద్దరు హీరోలు దొరికితే ఎలా తీయాలి రికార్డుల మోత మోగి పోవాలి.
మెగా అభిమానులు ఎంతో ఆతృతగా నాలుగేళ్ళ నుంచి ఎదురుచూస్తే నిమిషాలలో అదంతా ఆవిరైపోయింది. కథ ఫైనల్ చేయడంలో మెగాస్టార్ తర్వాతే ఎవరైనా అని అందరూ ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. కానీ చిరు లాంటి హీరో ఇలాంటి కథను ఎలా ఎంచుకున్నారు. అది కూడా తన కొడుకుతో కలిసి ఏ విధంగా నటించాలి అని అనుకున్నారో.. అనే సందేహాలు కూడా వస్తున్నాయి. దీంతో కొరటాల శివ మార్క్ సినిమా అంటే నమ్మే జనాలు లేకపోతున్నారు. కథాంశమే సరిగ్గా లేకపోవడం ఆచార్య సినిమాకు పెద్ద మైనస్.
తాజా పరిణామాల నేపథ్యంలో ఆచార్య సినిమా ఎఫెక్ట్ కొరటాల తర్వాత సినిమాల పై పడిందని స్పష్టం అవుతుంది.ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉన్న హీరోలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. ఈ సినిమా విషయమై తారక్ కు పలు జాగ్రత్తలు చెబుతున్నారు అభిమానులు. కానీ ఎప్పటిలానే శివ విజయాలు, వైఫల్యాలు అన్నవి అటుంచి ఆయనతో కలిసి పనిచేయాలనే అనుకుంటున్నాడని టాక్.