హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) పనులు మూడు నెలల్లో ప్రారంభమవుతాయని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రకటించారు. ఆర్ఆర్ఆర్లోని ఉత్తర భాగాన్ని ఇప్పటికే కేంద్రం మంజూరు చేసిందని, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) తయారీ చివరి దశలో ఉందని ఆయన చెప్పారు.
ప్రాజెక్టు దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలంటూ తెలంగాణ చేసిన అభ్యర్థనను పరిశీలిస్తామని తెలంగాణ ప్రభుత్వానికి మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో 12 జాతీయ రహదారులు, 7 సెంట్రల్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు.
ప్రాజెక్టు భూముల సేకరణలో 50 శాతం ఖర్చును తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఆర్ఆర్ఆర్తో పాటు నగరాలు, పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్ పార్కులను ప్లాన్ చేసి వాటి కోసం భూములను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ప్రతిపాదిత ఆర్ఆర్ఆర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ దాదాపు 340 కి.మీ పొడవు ఉంటుంది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.16,003 కోట్లుగా అంచనా వేశారు. 158 కి.మీ పొడవునా ఉత్తర భాగంలో భూసేకరణ పనులు వేగవంతం చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తామని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
182 కి.మీ పొడవునా ఉండే దక్షిణ భాగాన్ని ఇంకా జాతీయ రహదారిగా కేంద్ర మంత్రిత్వ శాఖ నోటిఫై చేయలేదని అన్నారు. సమాచార సాంకేతిక రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా, దేశానికి గ్రోత్ ఇంజిన్‌గా గడ్కరీ అభివర్ణించారు. మొత్తానికి చంద్రబాబు చొరవతో ఐటీ రంగ దిగ్గజాలు బెంగుళూరుతో పాటు హైదరాబాదును కూడా తమ డెస్టినేషన్ గా చేసుకోవడం మొదలుపెట్టాయి. అప్పటి నుంచి హైదరాబాదు ప్రయాణం ఆగలేదు.
దేశంలో 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలను అభివృద్ధి చేస్తున్నామని, వాటిలో 5 తెలంగాణ మీదుగా వెళతాయని మంత్రి గడ్కరీ అన్నారు. ఇండోర్-హైదరాబాద్ హైవే 787 కి.మీ పొడవు మరియు 17,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
Official Map (RRR) Regional Ring Road Expressway :
on Northen Side of Hyderabad connecting from Girmapur Village (on NH-65 at chainage Km.492+200) in Sangareddy District to Choutuppal (on NH-65 Chainage Km.55+400) in Yadadri Bhuvanagiri District via Medak and Siddipet District.
ఇంకా ప్రతిపాదనలో మరిన్ని రహదారులు…
తెలంగాణ మీదుగా 50 వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్న సూరత్-సోలాపూర్-కర్నూల్-చెన్నై హైవే
5 వేలకోట్లతో హైదరాబాద్-విశాఖపట్నం హైవే
రూ.12 వేల కోట్లు పెట్టి నాగ్‌పూర్-విజయవాడ హైవే విస్తరిస్తున్నారు.