తెలుగుదేశం పిలుస్తోంది రా… కదిలిరా… అనే పిలుపుతో, 250 పైచిలుకు అభిమానులు హాజరై, కరతాళ ధ్వనుల మధ్య ఎన్నారై తెలుగుదేశం కార్యకర్తలు పట్టాభి కొమ్మారెడ్డి మరియు విద్యా గారపాటి తో సమావేశమై, మే 20, 21 బోస్టన్ వేదికగా జరగనున్న NRI TDP మహానాడుకు శంఖారావం పూరించారు. తెలుగు మహిళలు, అన్న నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిని వెలిగించారు.
ఈసందర్బంగా విద్యా గారపాటి మాట్లాడుతూ, ప్రతి ఎన్నారై రోజుకి ఒక 15 నిమిషాలు సమయం వెచ్చించి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజానీకానికి తెలుగుదేశం యొక్క సిద్ధాంతాన్ని, లక్ష్యాలను ఆలోచింప చేయగలరని ఆశించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ గా చూడాలనుకున్న మన ఆంధ్రప్రదేశ్ ను అంధకార ఆంధ్రప్రదేశ్ చేశారని విచారం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి కొమ్మారెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఎండగట్టారు. 60 నిముషాలు పాటు అనర్గళంగా తన వాక్చాతుర్యంతో NRI సోదర, సోదరీమణులను మంత్ర ముగ్దులను చేశారు. అనంతరం మహానాడు కేక్ కట్ చేసి, లోగో ను మరియు టీజర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు యువత పెద్ద ఎత్తున పాల్గొని మహానాడు కు సిద్ధం అని జయ జయధ్వానాలు పలికారు.
చిన్న పిల్లలు మరియు తెలుగు మహిళలు తమ శైలిలో తెలుగుదేశం జెండాలతో జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్ర బాబు, జై లోకేష్ అనే నినాదాలతో కుల మతాలకు అతీతంగా పాల్గొని సభా ప్రాంగణాన్ని మారు మోగించారు.