ఔను.. ఇలా చేసి బీజేపీ ఏం పావుకుంటుంది? ఇదీ.. సామాన్యుడి ప్రశ్న. ప్రస్తుతం అంతో ఇంతో గ్రాఫ్ పుంజుకుంటున్న కమలం పార్టీలో మళ్లీ కొత్త గుబులు ప్రారంబమైంది. తాజాగా పార్టీ రాష్ట్ర చీఫ్.. సోము వీర్రాజు సంచలన కామెంట్లు చేశారు. త్వరలోనే జరగ నున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేస్తామని.. ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు.. బలమైన అబ్యర్థిని నిలబెట్టి.. మరింత బలంగా ప్రచారం చేస్తామన్నారు. అంతేనా.. ప్రబుత్వం చేస్తున్న అవినీతి.. ఉద్యోగాలు.. మడమ తిప్పడాలు.. వంటి అనేక అంశాలను అక్కడ ప్రజల్లోకి తీసుకువెళ్లి.. నెల్లూరు జిల్లా కమల పతాకాన్ని రెపరెపలాడిస్తామన్నారు.
ఇదంతా.. సొంత పార్టీ నాయకులు నవ్వుకుని.. బుగ్గలు నొక్కుకుని సంబరపడ్డారేమో కానీ.. సామాన్యులు మాత్రం… వీర్రాజుకు తిక్కకుదిరింది.. రోకలి బండ తలకు చుట్టుకుంటా నంటున్నాడు.. అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీర్రాజు ప్రయత్నమో.. లేక.. మోడీ ప్రభావమో.. తెలియదు కానీ.. అంతో ఇంతో బీజేపీ టాక్ వినిపిస్తోంది. అసలు ఏమీ లేని చోట.. వెంపలి చెట్టే మహా వృక్షమైనట్టుగా అసలు ఏమీ కనిపించని.. బీజేపీకి అంతో ఇంతో పాజిటివ్ టాక్ వస్తుండడం ఆశించదగ్గ పరిణామమే. దీనిని ఎంజాయ్ చేస్తే.. గ్రాఫ్‌ను మరింత పెంచుకునేందుకు పక్కా వ్యూహంంతో అడుగులు వేయాల్సి సోము.. అలా చేయడం మానేశారు.
అంతేకాదు.. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వస్తే.. అక్కడ.. తగుదునమ్మా.. అంటూ.. రెచ్చిపోయి.. పడిపోతున్నారు. అయినా.. ఆయనకు బ్రెయిన్ పనిచేయడం లేదని.. సొంత పార్టీ నేతలే.. సణుగుతున్న సంగతి ఆయనకు గ్రహించడం లేదని సామాన్యులు చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక.. పట్టు బట్టి.. జనసేననను పక్కన పెట్టి పోటీ చేసి.. పరాజయం పాలయ్యారు. బద్వేల్.. ఉప ఎన్నికలోనూ.. అరవీర భయంకరంగా.. పోరాడారు. అయినా.. కనీసం డిపాజిట్లు దక్కించుకోలేక పోయారు. వెరసి.. ఈ రెండు ఉప ఎన్నికల్లోనూ.. బీజేపీ సత్తా .. సోము వారి సత్తా స్పష్టంగా కళ్లకు కట్టాయి.
అయినా.. ఇప్పుడు మళ్లీ ఆత్మకూరు మాదే.. మేమే దక్కించుకుంటాం.. అని రాజు వెడలె.. అన్నట్టుగా వీర్రాజు వెడలేందుకు రెడీ అయ్యారు. ఇంతకన్నా పెద్ద కామెడీ ఏం ? ఉంటుంది. వాస్తవానికి ఆత్మ కూరులో వచ్చే ఉప ఎన్నిక.. ప్రభుత్వానికి.. పార్టీకి మధ్య జరిగేది.. కానేకాదనేవిషయం చిన్న పిల్లాణ్ని అడిగినా చెబుతాడు. కేవలం సెంటిమెంటుకు..కుటుంబానికి మధ్య జరిగే ఎన్నిక మాత్రమే. అది కూడా లాంఛనమే. మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరుకు కుంగిపోయింది. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి ఎవరు నిలబడినా.. ఏకపక్ష విజయం ఖాయం.
అంతేతప్ప.. ప్రభుత్వంపై అవినీతి.. అక్రమం అంటే.. ఇక్కడ ఎవరూ వినేందుకు రెడీగా లేరు. సో.. ఈ చిన్న విషయం కూడా సోముకు తెలియకపోతే.. ఎలా? అనేది సామాన్యుల టాక్. ఇక్కడ పోటీ చేయకుండా.. సింపతీ కోసం వదిలేశామని.. మేకపాటి కుటుంబాన్ని గెలిపించాలని ఆయన పిలుపునిస్తే.. బీజేపీ అభిమానులు కూడా సంతోషించి.. మరింతగా గ్రాప్ పుంజుకుంటుందని అంటున్నారు. కానీ, అలా వింటే.. సోము ఎందుకవుతాడు.. వీర్రాజే అవుతారు కానీ అని లోకల్ టాక్!!