ఏటా ప్రమాదాలు వేసవిలోనే అత్యధిక ప్రమాదాలు.. రక్షణ చర్యలు ఉన్నాయా అంటే ఉన్నాయి అని యాజమాన్యాలు అంటాయి కానీ ప్రమాదాలు జరిగితే మాత్రం అవి ఎక్కడున్నాయో తెలియవు. అధికారులా గుడ్లప్పగించి చూస్తారు. నాయకులా పట్టించుకోరు.. ఇవీ ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలు. పరిశ్రమలు విడుదల చేసే కాలుష్య కారకాల కారణంగా అవస్థ లు పడుతూ చనిపోయేవారు కొందరైతే, ప్రమాదాల రూపంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను అనాథలుగా మారుస్తున్న వారు కొందరు.
వేల కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసే పరిశ్రమలు ప్రమాదాలకు తావిస్తుంటే కనీస చర్యలు కూడా కొరవడుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. ముఖ్యంగా వేసవిలోనే తగిన రక్షణ చర్యలను తీసుకోవాల్సి ఉంది. బాయిలర్ల నిర్వ్హణపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. కానీ కంపెనీల నిర్లక్ష్య ఫలితంగానో లేదా మానవ తప్పిదాల కారణంగానో విలువయిన ప్రాణాలు పోతున్నాయి.
గతంలో కొన్ని హానికర పరిశ్రమలు వద్దే వద్దని చెప్పినా కూడా అడ్డదారుల్లో అనుమతులు తెచ్చుకున్న వారు ఫ్యాక్టరీలో బతుకు దెరువు కోసం వచ్చే కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సరైన సేఫ్టీ ప్రికాషన్స్ ను వాడకుండా తమ నిర్లక్ష్య వైఖరిని చాటుకుంటున్నారు. ఈ తరుణాన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు లేకున్నా జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోయింది. తాజాగా ఈ ప్రాంతం కొత్తగా ఏర్పాటయిన ఏలూరు జిల్లాలో ఉంది.
రసాయన పరిశ్రమలను వరుస విషాదాలు వెన్నాడుతున్నాయి. విశాఖ, పరవాడ ఘటన అప్పట్లో ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిందో తెలిసిందే. ఇప్పటికీ నాటి క్షతగాత్రులు కోలుకోలేదు. మృతులకు పరిహారం అందినా కుటుంబాలు స్థిమిత పడలేదు.
తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ముసునూరు మండలం, అక్కి రెడ్డి గూడెం రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలి ఆరుగురి చావుకు కారణం అయింది. మరో 18 మంది క్షతగాత్రులు ఉన్నారు. వీరిలో తీవ్ర గాయాలు అయిన వారు కొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులు విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కథనం ఇది.
వాస్తవానికి పరిశ్రమలు అన్నీ కాలుష్య ప్రధానం అయినవి ప్రమాదాలకు తావిచ్చేవి. ముఖ్యంగా రసాయన పరిశ్రమల నిర్వహణలో యాజమాన్యాల నిర్లక్ష్య ధోరణి కారణంగానే తరుచూ బాయిలర్లు పేలి కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేస్తున్నాయి. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికులను తరువాత ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలే ఉండవు.
పరిహారం అందించాం కదా ఇంకేం చేయాలి అన్న ధోరణే తప్ప ముందస్తు చర్యలు కొన్ని ప్రమాదాలు జరిగాక కూడా ఉండవు. రసాయన పరిశ్రమలు అన్నీ అత్యంత ప్రమాదాలకు తావిచ్చేలానే ఉన్నాయి. విశాఖలో హెటిరో డ్రగ్స్ లో జరిగిన ప్రమాదం ఎంతగానో కలిచివేసింది. దీని తీవ్రత కారణంగా చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారు. విషతుల్య వాయువుల కారణంగా ఎంతో మంది చుట్టుపక్కల ఉన్నవారు అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు ప్రమాదం లాంటిదే నిన్నటి వేళ కూడా జరిగింది. అ
యితే ఈ పరిశ్రమలో గతంలో ఎటువంటి ప్రమాదం జరగలేదని, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని సంబంధిత పర్యవేక్షకులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితేనే వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
A fire broke out inside a porous chemical industry in Akkireddygudem in Nizividu in Eluru district of Andhra Pradesh. 17 people were working inside the factory when the accident was reported. 6 feared dead and 11 injured in the accident. #AndhraPradesh pic.twitter.com/TBNWMPweS2
— Paul Oommen (@Paul_Oommen) April 14, 2022
Villagers of #Akkireddigudem in #Eluru dist of #AndhraPradesh protesting near Porus chemical factory, where 6 dead and 11 injured in fire accident due to #gasleak , they demands closure of factory. Police set up tight security.#FireAccident pic.twitter.com/lfEacmwmZD
— Surya Reddy (@jsuryareddy) April 14, 2022