మళ్లీ మనం పాతబడిపోవాలి లేదా పాడుబడిన కాలంలోకి వెళ్లి రావాలి లేదా మనం వెనక్కు పోయినా సరే పాలకులను మాత్రం పొగుడుతూ ఉండాలి. ఆ పనిచేస్తే కొడాలి నాని మాదిరి సేఫ్ గా ఉంటాం. రెడ్ శాండిల్ వుడ్ డాన్ మాదిరి సేఫ్ గా ఉండగలం కూడా ! కానీ వీటిపై బొత్స మాట్లాడలేకపోతున్నారు. ఎమ్మెల్యే ధర్మాన మాత్రం కాస్త బెటర్ వేలో నిన్న మాట్లాడారు. ఆ పాటి కూడా మిగతా వైసీపీ లీడర్లు మాట్లాడలేకపోతున్నారు. దేశ వ్యాప్తంగా కరెంట్ కష్టాలు ఉన్నాయి అని, ప్రభుత్వాలు వాటిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాయని వివరించారు…నిన్నటి వేళ శ్రీకాకుళం నగరంలో.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో..ఈ పాటి కూడా చెప్పడం రాని వారంతా పాపం నగర నాయకులుగా ఉన్నారు..ఆ మాటకు వస్తే మంత్రులుగా కూడా ఉన్నారు.
ఎనీవే మళ్లీ విసన కర్రలు కొనుగోలు చేసే రోజులొచ్చాయి కనుక ఆ కుటుంబాలకు ఓ విధంగా ఉపాధి. లాంతర్లు కొనుగోలు చేయడం కూడా మంచిదే ఏం కాదు. ఒక్కోసారి గత కాల స్మరణ తదనుగుణ కార్యాచరణ కూడా మంచిదే ! ఏం కాదు ఉన్నోళ్లంతా హాయిగా ఏసీలు వేసుకుని కమ్మని కలల లోకంలో విహరించారని కానీ తామంతా దోమలతో సావాసం చేస్తూ కంటి మీద కునుకు లేకుండా గడిపామని పాపం ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలే కాదు తిరుపతి వరకూ అప్రకటిత కోతలు ఉన్నాయి. కనుకనే మార్కెట్లో విసన కర్రలకు డిమాండ్ మళ్లీ పెరిగింది. ఇలా అంటే జగన్ కు కోపం వచ్చినా కూడా ఇదే నిజం. పోనీలేండి నాని గారూ మమ్మల్ని క్షమించండి కానీ బూతులు మాత్రం తిట్టమాకండి. మీ పుణ్యం ఉంటుంది.
ఏం కాదు నాల్గురోజులు ఆగండి మంచి రోజులు వస్తాయి అని అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఏం కాదు మా తప్పు అస్సలు కాదు కావాలంటే పొరుగు రాష్ట్రాలకు పోయి చూడండి అక్కడ కూడా కోతలు ఉన్నాయి అని కూడా చెబుతున్నాయి అదే వర్గాలు. కనుక ఇప్పుడు ఏం చేయాలి రాత్రి మూడు నుంచి నాలుగు గంటల పాటు కరెంట్ లేకుండా చేశారు. బాగుంది పోనీ వ్యవసాయంకు అయినా ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఈ దశలో ఓట్లు వైసీపీకే వేయాలి లేదంటే బతకనిస్తారా అంటే జనసేన సెటైర్లు వేస్తోంది.