తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రారంభించిన రేషన్ వాహనాలకు పచ్చజెండా ఊపే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తం గా మంచి ఫోకస్ లభిస్తుందని వైసీపీ నాయకులు అంచనా వేసుకున్నారు. దీనికి సంబంధించి భారీ అం చనాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజా కార్యక్రమంపై భారీ అంచనాలు వేసుకున్నారు. ఇటీవల కాలంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల ఘటనల విషయంతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరికి గురవుతోంది. ఈ క్రమంలో తాజా కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు ఉన్న వ్యతిరేకత అంతో ఇంతో తగ్గుతుందని వైసీపీ నాయకులు అంచనా వేసుకున్నారు.
ఇంటింటికీ రేషన్‌ను పంపిణీ చేసేందుకు ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనా లను మంత్రులు ప్రారంభిస్తారు. మొత్తం 9,260 వాహానాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. నిజానికి చెప్పాలంటే.. ఇది ఇప్పటి వరకు ఎవరూ చేయని కార్యక్రమమే!
అయితే.. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు ఆశించిన మేరకు ఫోకస్ మాత్రం లభించకపోవడం గమనా ర్హం.దీనికి రెండు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఉదయాన్నే రాష్ట్ర హైకోర్టు.. స్థానిక ఎన్నికల విషయంలో సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిం దేనని తేల్చిచెప్పింది. దీంతో ఈ తీర్పుపై కేవలం రాజకీయ నేతలే కాకుండా సాధారణ ప్రజల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఇక, తిరుపతిలో టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు ధర్మపరిరక్షణ యాత్ర ప్రారంభించేందుకు వెళ్లారు. అయితే.. దీనికి పోలీసులు అడుగడుగునా అడ్డుపడ్డారు.
దీంతో ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. తమ రథయాత్రకు అనుమతి ఇవ్వనందున.. బీజేపీ నాయకులు కూడా డీజీపీ ఆఫీస్ ముట్టడికి రెడీ అయ్యారు. దీంతో ఎంతో భారీ ప్రచారం వస్తందని భావించిన సీఎం కార్యక్రమానికి వైసీపీ నాయకులు ఆశించిన ఫోకస్ రాకపోవడం గమనార్హం. దీంతో వైసీపీ నాయకులు తలపట్టుకున్నారు. దీనిని మరోరోజు పెట్టుకుని ఉంటే బాగుండేదేమో..అనే చర్చ చేస్తున్నారు. అయినా.. కార్యక్రమం అయిపోయింది కనుక చేసేదేం లేకుండా పోవడం గమనార్హం.