చంద్రబాబు ఇమేజ్ పెంచిన ISB viral pic

చంద్రబాబు నాయుడు... ఆయన రాజకీయాల్లో ఎన్నో పొరపాట్లు చేసి ఉండొచ్చేమో గాని రూలింగ్ లో మాత్రం రాష్ట్రాన్ని తారా స్థాయిలో నిలపడానికి ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన విజన్లో మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, జీనోమ్ వ్యాలీ,  హైటెక్ సిటీ, గాంధీ ఆస్పత్రి... ఎన్నో ఉన్నాయి. మెమొరీలు షేర్ చేస్తే రోజుకు ఒకటైనా ఉంటుంది.

కానీ తాజాగా ఐఎస్బీ కి రెండు దశాబ్దాలు గడిచిన సందర్భంగా ఈ కలను సాకారం చేసిన విజనరీలు అంటూ ఐఎస్బీ పెట్టిన పోస్టు ఈరోజు వైరల్ అయ్యింది. ఆ ఫొటోలో ఐఎస్బీ వ్యవస్థాపకులు, ఆ నాటి ప్రధాని వాజ్ పేయి, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఈ ఫొటో టైమింగ్ చంద్రబాబు ఇమేజ్ ను మరింత పెంచినట్లయ్యింది.

ఒకవైపు తన పేరును జనాలకు గుర్తుండేలా చేయడానికి ఉచిత పథకాలతో జగన్ చిత్రవిచిత్రమైన పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంటే... బాబుకు సంబంధం లేకుండా ఆయన ఎపుడో చేసిన కృషి బాబు ఇమేజ్ ను పెంచేలా టైమింగ్ తో రావడం బాబు విజన్ ను ప్రపంచానికి మరోసారి తెలియపరిచింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.