యాదాద్రి శ్రీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం పూర్తయ్యింది
ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ సంప్రోక్షణ పూజలు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తాయి.
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి దర్శనానికి వచ్చే భక్తులు టికెట్ కౌంటర్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రేపు దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి దర్శనం దక్కేలా చూస్తారు.
టికెట్ కౌంటర్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు, దానికి జియో ట్యాగింగ్ ఉంటుంది.
క్యూ కాంప్లెక్స్ లో 8000 మంది వేచి ఉండే సామర్థ్యం ఉంది.
క్యూలైన్ లో ఇబ్బందులు లేకుండా ర్యాంప్, ఎస్కలేటర్,స్టేర్ కేస్, లిఫ్ట్ సౌకర్యం ఉంది.
ఎల్లుండి నుండి ఆలయ సమయ వేళల ప్రకారం దర్శనాలు కల్పిస్తారు.
టెంపుల్ తరుపున 88 సీసీ కెమెరాలు, పోలీసు శాఖ తరుపున 150 కెమెరాలు ఏర్పాటు చేస్తాం.
రేపు ఉదయం పది గంటలకు పూర్ణాహుతి తరువాత ఆలయం చుట్టూ మూడు రౌండ్లు ప్రదక్షిణలు చేస్తారు.
రేపు ఉదయం 11 గంటల ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ మహా కుంభ సంప్రోక్షణలో పాల్గొంటారు.