టీడీపీ కన్నా జనసేనకు జనంలో క్రేజ్ ఉంది అన్నది వాస్తవం.దానిని నిలుపుకునేందుకు ఇప్పటిదాకా పవన్ చేసిన కృషి పెద్దగా లేదు.గత సారి పవన్ కొంత స్వశక్తిని నిరూపించుకోవాలని ప్రయత్నించినా విఫలం అయ్యారు పవన్. ఆఖరి నిమిషంలో మూడు వందల కోట్లు తాను పోటీచేసిన రెండు నియోజకవర్గంలో వైసీపీ వెదజల్లడంను చూసి, ఆయా సందర్భాల్లో ఆ పార్టీ ఎత్తుగడలను చూసి పవన్ ఆశ్చర్యపోయారు. అందుకే ఈ సారి పవన్ అభిమానులు నిజమైన జనశక్తిని కూడదీసే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు.
ఉచిత పథకాలకు జనం ఆకర్షితులై సోమరులు చేస్తున్న వైనం ఒకటి జనసేనను ఏనాటి నుంచో ఇబ్బంది పెడుతోంది. అందుకే పవన్ చెప్పిన వాటిలో పెద్దగా ఉచిత పథకాలు లేవు. నైపుణ్యం ఉన్న యువతకు ఐదు లక్షలు ఇచ్చి సొంతంగా యూనిట్లు ఏర్పాటుచేసుకునేందుకు సహకరిస్తామన్నారే తప్ప మిగతా హామీలలో ఉచితాలు లేవు. ఆ విధంగా పవన్ ఎంతో ముందు చూపుతోనే ఉన్నారు.
గ్రామాల్లో జనసేన, పట్టణాల్లో జనసేన అంటూ ఇకపై కార్యక్రమాలు విడివిడిగా చేపట్టేందుకు, పవన్ ఆశయాన్నీ సిద్ధాంతాన్నీ ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు సంబంధిత కార్యకర్తలు. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై ఓ లెక్క అన్న విధంగా పవన్ అభిమానులు తమ రాజకీయ ఎదుగుదలను ఎవ్వరూ నిలువరించలేరని అంటున్నారు.
ముఖ్యంగా గత ఎన్నికల్లో ఎదురయిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వాటిని పునరావృతం కానివ్వకుండా రాజకీయ రంగంలో ఉన్నత లక్ష్యాల సాధనే ధ్యేయంగా అడుగులు వేసేందుకు పవన్ సేన అదేనండి జనసేన సిద్ధం అవుతోంది. యుద్ధం ఎవరితో అన్నది స్పష్టం అయ్యాక, వారిని ఎలా ఎదుర్కోవాలో అన్నదే ఓ సందిగ్ధం గా ఉంది. కనుక ఈ సారి జగన్ ను నిలువరించే శక్తిగా జనసేన మారనుంది.
మరోవైపు పవన్ కల్యాణ్ కూడా తాను గెలుస్తూనే ఇతరులను గెలిపించిన దాఖాలాలు ఏవీ లేవని అంటున్నారు. తాను గెలిపించిన దాఖాలాల్లో ఒంటరి అయిపోయానన్న వేదనలో ఉన్నారు. కోట్లు కుమ్మరించి ప్రశాంత్ కిశోర్ లాంటి వారిని తాను నియమించుకోలేనని కానీ సానుభూతి రాజకీయాలు కన్నా నిజాయితీతో నమ్మకంతో కూడిన రాజకీయాలే ఎక్కువ కాలం నిలుస్తాయి అని తన అభిమానులకు పదే పదే ఉద్బోధ చేస్తున్నారు.ఈ క్రమంలో ఆయన ప్రజా పోరాటాలు మరిన్ని చేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు.
ఎమ్మెల్యేల అవినీతి కి సంబంధించి ఎక్కడికక్కడ నిలదీస్తే మంచి ఫలితాలు వస్తాయి అని, మన పౌర సమాజంలో నిలదీసే వారు లేకనే వైసీపీ రెచ్చిపోతోందని ఓ సందర్భంలో పవన్ అన్నారు. అదే ఇప్పుడు నిజం కానుంది. సోషల్ మీడియాను వినియోగించుకుంటూనే రానున్న కాలంలో ఎక్కువ శాతం ప్రజా క్షేత్రంలో పనిచేయాలని పిలుపు నిస్తున్నారు పవన్.
అదేవిధంగా ఆయనను అభిమానించే వారు సైతం ఇకపై ఎక్కువ కాలం క్షేత్ర స్థాయిలో ఉండేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకు అనుగుణంగా గ్రామాలలో పెద్ద పెద్ద తెరలు ఏర్పాటు చేసి, ప్రొజెక్టర్ ద్వారా పవన్ స్పీచ్ ను ప్రదర్శిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటిదాకా జనం కోసం పవన్ చేసిన పనులను వివరిస్తూ, ఇంటింటికీ జనసేన కార్యక్రమాన్నీ చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.