కల్తీ సారా మరణాలను ప్రభుత్వం మాత్రం సహజ మరణాలనే అంటోంది.దీనిని విపక్ష హోదాలో ఖండిస్తోంది పసుపు పార్టీ. ఈ విరుద్ధ భావాల మధ్య ఇవాళ ఆంధ్రావనిలో తీవ్ర స్థాయిలో నిరసనలు చోటు చేసుకున్నాయి.ఎప్పటిలానే పోలీసు కనుసన్నల్లో, స్టేషను తరలింపుల నేపథ్యంలోనే టీడీపీ చెప్పాల్సిందంతా చెప్పింది.
అంతేకాదు పలు చోట్ల ఆదాయ వ్యయాలకు ఉన్న వ్యత్యాసాలను కూడా వివరించింది. మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఆ రోజు కన్నా ఈ రోజు మూడు రెట్లు కన్నా అధికం గా ఉన్నా కూడా అసలు ఖజానాకు ఎందుకని ఆర్థికంగా లోటు కనిపిస్తుందో తమకు అర్థమే కావడం లేదు అని శ్రీకాకుళం టీడీపీ యువ నేతలు ప్రశ్నించారు.
మద్యపాన నిషేధం అన్నది రాష్ట్రంలో సాధ్యం కాదా? అంటే ఆ రోజు విపక్ష నేత హోదాలో పాదయాత్ర సందర్భంగా చెప్పిన మాటలు ఏవీ జగన్ మోహన్ రెడ్డి అమలు చేయలేరా? అంటే మహిళలు తాళి బొట్లు తెగి పడుతున్నా ప్రభుత్వానికి మేల్కొల్పు అన్నదే లేదా? ఇవే ప్రశ్నలు ఏలూరు కేంద్రంగా పాలకొల్లు కేంద్రంగా వినిపిస్తున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంలో ఇవాళ జరిగిన నిరసనల్లో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మహిళల తాళిబొట్లతో వినూత్న నిరసన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వమే నడుపుతున్న మద్యం దుకాణాల్లో లభ్యం అవుతున్న చీప్ లిక్కర్ బాటిళ్లను ధ్వసం చేశారు. ఆ విధంగా ఆయన తన నిరసనను తెలిపి మీడియా కంట పడ్డారు.రాష్ట్రంలో కల్తీ సారా ఒక్కటే కాదని ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం బ్రాండ్లు అన్నీ
హాని కరమైనవేనని ఆందోళన చెందారు.
ఈ దశలో రాష్ట్రంలో జే బ్రాండ్ కలవరం ఒకటి రేగుతోంది.అంటే జగన్ బ్రాండ్ అని టీడీపీ చెబుతున్న వివరం మరియు చేస్తున్న వర్ణన కూడా!టీడీపీ చెబుతున్న భాష్యం అనుసరించి రాష్ట్రంలో ఎక్కడా నాణ్యమయిన మద్యం అందుబాటులో లేదని, ప్రభుత్వం అమ్ముతున్న మద్యం బ్రాండ్లు అన్నీ నాసిరకం అయినా కూడా అధిక ధరలు చెల్లించి ప్రజలు తమ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని అంటూ టీడీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.శ్రీకాకుళం మొదలుకుని అనంతపురం దాకా టీడీపీ చేపట్టిన నిరసనలకు ప్రజా మద్దతు కూడా భారీగా కనిపించింది.
రాష్ట్రంలో కల్తీ సారా నిర్మూలన, జె-బ్రాండ్స్ నిషేధంపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పెడన మండలం నేలకొండపల్లి గ్రామం లో ప్రభుత్వ మద్యం షాప్ వద్ద నిరసన కార్యక్రమం లో కాగిత కృష్ణ ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు. pic.twitter.com/gAjysUWQ7M
— Krishna Prasad Kagitha (@KpKagitha) March 19, 2022
ఎన్నడూ లేని విధంగా మద్యం ఔట్ లెట్లు ప్రభుత్వమే తెరవడం ఓ విడ్డూరం కాగా, అక్కడ లభ్యం అయ్యే మందు (విదేశీ కంపెనీలకు చెందిన మందు) సామాన్యుడికి అందుబాటులో లేని ధరలో ఉన్నాయని ఆశ్చర్యపోతోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టని విధంగా ప్రభుత్వమే తన వంతుగా మద్యం అమ్మకాలు సాగించడమే ఈ విడ్డూరానికి కారణమని అంటోంది. నాయకుడి సొంత ఖజానా నింపడానికి పేరు లేని మద్యానికి స్టిక్కరేసి దండుకున్నారని టీడీపీ ఆరోపించింది.
అమ్మఒడి ఇచ్చి జె-బ్రాండ్స్ తో నాన్న లేకుండా చేస్తున్నావు.. pic.twitter.com/HnJo9I5lEj
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) March 19, 2022
రాష్ట్రంలో జె-బ్రాండ్స్ మరియు కల్తీ మద్యం సారా అరికట్టాలని జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాల పై విచారణ జలపాలని తెలుగుదేశం పార్టీ శృంగవరపుకోట నియోజకవర్గం ఆధ్వర్యంలో కొత్తవలస రైల్వే గూడ్స్ షెడ్ నుంచి జుంక్షన్ లో అంబెడ్కర్ విగ్రహం వరకు pic.twitter.com/LDD33bSbF9
— Kolla Lalitha Kumari (@Lalitha_KumariK) March 19, 2022
జె-బ్రాండ్స్ పోవాలి.. జగన్ రెడ్డి దిగిపోవాలి మదనపల్లి లో రాజంపేట పార్లమెంట్ ఆఫిసు నుంచి గవర్నమెంట్ వైన్ షాప్ వరకు పాదయాత్ర నిర్వహించిన @JaiTDP జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి గారు, పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు (1/2)@iTDP_Official pic.twitter.com/xjPAYarEzz
— iTDP Rajampet PC (@iTDP_RajampetPC) March 19, 2022
జె -బ్రాండ్స్ తో ప్రజలకేమో పాడెలు. జగన్ రెడ్డికి మేడలు..#YSRCPNatuSaraMafia pic.twitter.com/3yTOR1tSQs
— Kodela Sivaram (@KodelaDr) March 19, 2022
జె – బ్రాండ్స్ పోవాలి….
జగన్ రెడ్డి డిగిపోవాలి
మహిళల మాంగల్యాలు తెంచే కల్తీ మద్యం వద్దు.
"ప్రజలకేమో పాడెలు
జగన్ రెడ్డికి మేడలు (వేలకోట్లు ఆస్తులు)"
"జె – బ్రాండ్ పాపం ప్రజల ఆరోగ్యానికి శాపం"
"సారా సిఎం డౌన్ డౌన్
కల్తీ సిఎం డౌన్ డౌన్"
"జగన్ బ్రాండ్స్ అగ్గి
సంసారాలు బుగ్గి" 1/2 pic.twitter.com/D4sF64K1wD— iTDP Eluru Parliament (@iTDP_Eluru_PC) March 18, 2022