యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `రాధేశ్యామ్` విడుదలైంది. మూడేళ్ల నుంచి ఊరిస్తూ వచ్చిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక రివ్యూవర్లు, క్రిటిక్స్ కూడా సినిమాలో ఎక్కువుగా లోపాలనే టార్గెట్ చేశారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వ అనుభవ లేమి ఇక్కడ స్పష్టంగా కనిపించింది.
సాహో నెగిటివ్ టాక్ వచ్చినా.. బాహుబలి ది కంక్లూజన్ తర్వాత రావడం.. మాంచి యాక్షన్ సినిమా కావడంతో ఏదోలా పాస్ అయిపోయింది. ఆ సినిమాకు బాలీవుడ్లో వచ్చిన కలెక్షన్లతో గట్టెక్కేసింది. తెలుగులో మరీ లాస్ అయితే రాలేదు.
ఇక ఇప్పుడు రాధేశ్యామ్ పరిస్థితి తల్లకిందులయ్యేలా ఉంది. ఇంత స్లో ప్రేమకథ జనాలకు ఎక్కుతుందా ? అన్న సందేహాలు ఉన్నాయి. ఏదేమైనా ఫస్ట్ వీకెండ్ ముగిస్తే కాని క్లారిటీ రాదు. సాహో ప్లాప్ అయినా బాలీవుడ్లో తొలి రోజు రు. 25 కోట్ల వసూళ్లు రాబట్టింది. రాధేశ్యామ్‌కు తొలి రోజు అక్కడ రు. 5 కోట్లు కూడా రాలేదు. ఎందుకో మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌కు షాక్ ఇస్తుండడంతో వాళ్లు ముందు నుంచి అక్కసుతోనే ఉంటున్నారు.
బాహుబలి 1 రిలీజ్ అయినప్పుడు సల్మాన్‌ఖాన్ సినిమాకు పోటీ వస్తుందని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అయితే వసూళ్లతో బాహుబలి వాళ్ల నోళ్లు మూయించింది. తర్వాత బాహుబలి 2ను వాళ్లు విమర్శించే సాహసం కూడా చేయలేకపోయారు. ఇక ప్రభాస్ అక్కడ ఖాన్లకు ఎక్కడ పోటీ వస్తాడో ? అన్న భయంతో వాళ్లు సాహోను గట్టిగా టార్గెట్ చేశారు. సాహో ఓ చెత్త సినిమా అని దారుణంగా రేటింగ్‌లు ఇవ్వడంతో పాటు.. బాగా ట్రోలింగ్ చేశారు.
అయితే టాక్ ఎలా ఉన్నా సాహో దిమ్మతిరిగే వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు రాధేశ్యామ్‌ను కూడా వాళ్లు దారుణంగా ఆడుకుంటున్నారు. రాధేశ్యామ్ నెగిటివ్ టాక్‌తో గట్టెక్కే ఛాన్సులు లేవు. ఇదే తడవుగా వాళ్లు చిన్న కథ చెప్పడానికి అంత సెటప్‌లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఆచితూచి స్పందించే తరణ్ ఆదర్శ్ లాంటి ట్రేడ్ ఎనలిస్టులు కూడా సినిమా అస్సల్ బాలేదని చెబుతున్నారు.
ఇక కొందరు ఫిల్మీక్రిటిక్లు అయితే పర్సనల్‌గా ప్రభాస్‌ను టార్గెట్ చేస్తున్నారు. 42 ఏళ్ల ప్రభాస్‌కు, 52 ఏళ్ల భాగ్య శ్రీ అమ్మ ఎలా ? అవుతుందని ప్రశ్నిస్తున్నారు. భాగ్యశ్రీ, ప్రభాస్ కి చెల్లిలా వుందని సెటైర్ వేస్తున్నారు. ఏదేమైనా మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌ను షేక్ చేస్తుండటంతో వాళ్లు తట్టుకోలేకపోతున్నారని టాక్.