మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా నటించగా.. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తైన వెంటనే రామ్ చరణ్ తన తదుపరి సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్‌తో స్టార్ట్ చేశాడు.
`ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు `సర్కారోడు` అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ పుణేలో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అలాగే రెండో షెడ్యూల్‌ను శంకర్ రాజమండ్రిలో కంప్లీట్ చేశాడు. సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో జరిగాయి. అయితే ఇప్పుడు ఇదే ఏపీలో `ఆర్సీ 15`కి కలిసొచ్చే అంశంగా మారింది.
ఈ మధ్యే టికెట్ రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వంద కోట్లు, అంతకుమించి బడ్జెట్‌తో తెరకెక్కే చిత్రాలు ఏపీలో 20 శాతం చిత్రీకరణ జరుపుకుంటే.. 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కూడా ఏపీ సర్కార్ కల్పించింది. యాధృచ్ఛికంగా `ఆర్సీ 15` రెండో షెడ్యూల్ రాజమండ్రిలోనే జరిగింది. పైగా దిల్ రాజు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతో లక్కంటే చరణ్‌దే అని.. ఏపీలో తన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే అద్భుత అవకాశాన్ని కొట్టేశాడని అంటున్నారు.