నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` ప్రమోషన్స్‌తో తీరిక లేకుండా గడుపుతున్నారు. కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. కృష్ణం రాజు, భాగ్యశ్రీ, సత్యరాజ్ కీలక పాత్రలను పోషించారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే సినిమాపై మరిన్ని అంచనాలను పెంచడం కోసం ప్రభాస్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఫ్యాన్స్‌కు ఓ స్వీట్ న్యూస్‌తో పాటు ఓ బ్యాడ్ న్యూస్ కూడా చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు చేరువవుతున్నారు.
కానీ, ప్రభాస్ అందుకు భిన్నం. భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఈయన సోషల్ మీడియాను చాలా తక్కువగా యూజ్ చేస్తారు. అయితే రాబోయే రోజుల్లో తాను మరింత తక్కువగా ఆన్లైన్లో ఉంటానని తాజాగా బాంబ్ పేల్చాడు ప్రభాస్. స్వీట్ న్యూస్ ఏంటంటే.. ఇకపై ఏడాదికి ఈయన రెండు, మూడు సినిమాలు చేయనున్నాడట.
సోషల్ మీడియా ద్వారా కాకుండా సినిమాలతోనే అభిమానులకు దగ్గరవుతానని, నా ఫ్యాన్స్ హ్యాపినెస్ కోసం నేను ఏడాదికి 300 రోజులు పని చేస్తానని తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పుకొచ్చారు. అలాగే తనకు సపోర్ట్‌గా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఏడాదికి 2-3 సినిమాలు చేయాలని నిర్ణయించుకోవడం బాగానే ఉంది. కానీ.. సోషల్ మీడియాను వాడటం మరింత తగ్గిస్తానని ప్రభాస్ చెప్పడం.. ఆయన ఫ్యాన్స్‌కు ఏ మాత్రం నచ్చలేదట.