చుట్టూ ఉన్నప్రపంచంలో జరిగే దారుణాల గురించి మాట్లాడేందుకుపెద్దగా ఇష్టపడని సెలబ్రిటీలు.. తమ ఇమేజ్ ను పెంచటం.. నలుగురు తమ గురించి మాట్లాడుకునే అంశాల మీద మాత్రం పోస్టుల మీద పోస్టులు పెడుతుంటారు.
సామాజిక అంశాలు..రాజకీయ ప్రభావితం అంశాల మీద స్పందించేందుకు పెద్దగా రియాక్టు కారు. పెద్ద పెద్ద విషయాలు ఎందుకు.. చిత్ర పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసే ఏపీ ప్రభుత్వ టికెట్ల ధరల తగ్గింపు రచ్చపై ట్వీట్లు చేయటం.. తమకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వారిలో ఎంతమంది స్పందించారో అందరికి తెలిసిందే.
అలాంటిది హీరో రామ్ తాజాగా ఒక అంతర్జాతీయ అంశం మీద స్పందించారు. ప్రపంచ ప్రజలకు తాను చెప్పాలనుకున్నది చెప్పే ప్రయత్నం చేశారు. ప్రపంచాన్ని టెన్షన్ పెట్టిస్తున్న రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మీద ఆయన పోస్టు పెట్టారు. టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ యుద్ధం మీద పెద్దగా పోస్టులు పెట్టింది లేదు కానీ.. బాలీవుడ్.. హాలీవుడ్ కు చెందిన పలువురు సెలబ్రిటీలు మాత్రం తమ అభిప్రాయాల్నిసోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
ఇంతకూ రామ్ పోతినేని చేసిన ట్వీట్ ను చూస్తే.. ‘‘యుద్ధంలో పోరాడేందుకు ఇతర దేశాలు నేరుగా తమ సైన్యాన్ని పంపడం సరైన చర్య కాకపోవచ్చు. కానీ, తమ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి సైన్యాన్ని వాడడం వారి బ్లడీ గాడ్ డామ్ డ్యూటీ’’ అని పేర్కొన్నారు. టైమ్లీగా ఉన్న ఈ ట్వీట్ ను చూస్తే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇమేజ్ పెంచేదిలా ఉందన్న విషయం అర్థమవుతుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే..అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధంలో ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యను చెబుతున్నదంతా బాగుంది కానీ.. టాలీవుడ్ పరిశ్రమను ఇబ్బంది పెట్టేలా ఏపీ సర్కారు తీసుకున్న టికెట్ల ఇష్యూ మీద కూడా ఇదే స్ఫూర్తితో పోస్టులు పెట్టొచ్చు కదా? అలా ఎందుకు జరగటం లేదంటారు?