బీజేపీతో కయ్యానికి కాలుదువ్వుతున్నసీఎం కేసీఆర్ ..జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయి రాజకీయాల్లో కేసీఆర్ తరఫున ప్రతినిధిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ను నియమించాలని కేసీఆర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ను టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపించాలని, ప్రకాష్ రాజ్ తరఫున తన వాయిస్ వినిపించాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో భేట ీసమయంలోనూ కేసీఆర్ తన వెంట ప్రకాష్ రాజ్ ను తీసుకువెళ్లారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఊతమిచ్చేలా తాజాగా ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ప్రకాష్ రాజ్…పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్‌తో జాతీయ రాజకీయాలకు సంబంధించిన కీలక విషయాలపై చర్చించేందుకు వచ్చిన పీకేతో భేటీకి ప్రకాష్ రాజ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు గులాబీ బాస్.
తాజా భేటీతో టీఆర్ఎస్ తరఫున పీకే పనిచేస్తున్నారన్న విషయం కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. సుమారు నాలుగు గంటల పాటు ప్రకాష్ రాజ్, కేసీఆర్, పీకేల మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏక తాటిపైకి తేవడం ఎలా వంటి విషయాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
జాతీయ రాజకీయాల్లో ఇతర పార్టీలను ఏకం చేసే సమన్వయ బాధ్యతలను కేసీఆర్ తరపున ప్రకాష్ రాజ్ తీసుకోబోతున్నారట. ఈ క్రమంలోనే అనుసరించాల్సిన వ్యూహాలను ప్రకాష్ రాజ్క పీకే టీం దిశానిర్దేశం చేయనుందట. కేసీఆర్, పీకేల ప్లాన్ కు తగ్గట్లుగా ప్రకాష్ రాజ్ నడుచుకోబోతున్నారని తెలుస్తోంది. మోడీని ఢీకొట్టాలంటే బీజేపీ విధానాలపై విరుచుకుపడే ప్రకాష్ రాజ్ సరైన వ్యక్తి అని కేసీఆర్, పీకేలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.