పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో దగ్గుబాటి రానాలు లీడ్ రోల్ లో తెరకెక్కిన “భీమ్లా నాయక్” ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది.
ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు డల్లాస్ కూ “భీమ్లా నాయక్” ఫీవర్ పాకింది. సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో డల్లాస్ లో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
పవన్ 27వ సినిమా అయిన భీమ్లా నాయక్ కు గుర్తుగా డల్లాస్ లో పవన్ అభిమానులు, పవన్ ఫొటోకు కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు కొట్టి పండుగ చేసుకున్నారు.
డల్లాస్ లోని పవన్ అభిమానులతో పాటు, జనసేన మరియు టీడీపీ సానుభూతిపరులు, సినీ అభిమానులు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్నారు.
హర్ష వర్ధన్ రెడ్డి పందిరి, భరత్ ,వినాయక్ అంపుల, గణేష్ సుఖవాసి, మోనిక్ చింత, రాహుల్ ,హేమంత్, నాగార్జున, సురేష్, శ్రీకాంత్ అల్లం తదితరులు ఫన్ మూవీ గ్రిల్ రిచర్డ్సన్ లో జరిగిన ఈ సంబరాలలో సందడి చేసారు